Advertisement

  • ఏపీలో గురువారం కొత్తగా 3620 పాజిటివ్ కేసులు మరియు 16 మంది మరణం

ఏపీలో గురువారం కొత్తగా 3620 పాజిటివ్ కేసులు మరియు 16 మంది మరణం

By: chandrasekar Fri, 23 Oct 2020 09:36 AM

ఏపీలో గురువారం కొత్తగా 3620 పాజిటివ్ కేసులు మరియు 16 మంది మరణం


కరోనా ఉదృతి ఏపీ లో కొంతవరకు తగ్గుముఖం పట్టింది. ఇంతకుముందు కంటే తగ్గింది. ఏపీలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గత 24 గంటల్లో 76,726 శాంపిల్స్ పరీక్షించగా మరో 3620 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 7,96,919కు చేరింది. గడచిన 24 గంటల్లో 16మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6524కి చేరింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,723మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 7,58,138 నమోదయ్యింది. మరో 32,257మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లా 631, తూర్పు గోదావరి జిల్లాలో 492, చిత్తూరు జిల్లాలో 412, గుంటూరు జిల్లాలో 385, కృష్ణా జిల్లాలో 370, ప్రకాశం జిల్లాలో 311, కడప జిల్లాలో 212, అనంతపురం జిల్లాలో 196, విశాఖపట్నం జిల్లాలో 171, నెల్లూరు జిల్లాలో 126, శ్రీకాకుళం జిల్లాలో 126, విజయనగరం జిల్లాలో 122, కర్నూలు జిల్లాలో 66 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,12,186 పాజిటివ్ కేసులు నమోదు కాగా తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో కేసులు సంఖ్య 81,252కు చేరాయి. చిత్తూరు జిల్లాలో 75,343 కేసులుగా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లుంది. రికవరీ రేటు కూడా పెరుగుతోంది మరియు మరణాల సంఖ్య కూడా తగ్గింది. వాక్సిన్ అందుబాటులోకి వస్తే గాని దీనిని పూర్తిగా కట్టడి చేయలేము.

Tags :
|

Advertisement