Advertisement

సుశాంత్ పేరుపైన అసలు సిమ్ కార్డే లేదు

By: chandrasekar Mon, 03 Aug 2020 09:43 AM

సుశాంత్ పేరుపైన అసలు సిమ్ కార్డే లేదు


సుశాంత్ మరణంపై అనేక వార్తలు వెలువడుతున్న ఈ సమయంలో ఇటు బీహార్ పోలీసులు మరియు ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వాడిన మొబైల్ సిమ్ కార్డులు ఆయన పేరుతో నమోదు కాలేదని బీహార్ పోలీసులు తెలియజేసారు. ఒక సిమ్ ఆయన స్నేహితుడు సిద్ధార్థ్ పిథాని పేరుతో ఉందని చెప్పారు. సుశాంత్ వినియోగించిన మొబైల్స్ కాల్ డేటా రికార్డులను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు బీహార్ పోలీసులు వివరించారు.

సుశాంత్ ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు చనిపోయిన మాజీ మేనేజర్ దిషా శాలియన్ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తునట్లు చెప్పారు. ఫోన్ ద్వారా వారిని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందించడం లేదని బీహార్ పోలీసులు తెలిపారు. సుశాంత్ తల్లిదండ్రులు తమ కుమారుడి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో బీహార్ పోలీసులు కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. దీని కోసం దర్యాప్తు కొరకు కొందరు పోలీసులు ముంబై వెళ్లారు.

సుశాంత్ హత్యపై ముంబై పోలీసులు తమకు సహకరించడం లేదని బీహార్ పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బీహార్ పోలీసు బృందానికి పాట్నా (సెంట్రల్) పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) వినయ్ తివారీ నాయకత్వం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముంబైకి బయలుదేరారు. అతని మరణంపై ఏర్పడిన మిస్టరీని ఎప్పుడు ఛేదిస్తారో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Tags :
|

Advertisement