Advertisement

  • కరోనా వైరస్ ఉత్పరివర్తనం వల్ల ప్రాణాలకు ప్రమాదం లేదు; సింగపూర్ వైద్యుడు

కరోనా వైరస్ ఉత్పరివర్తనం వల్ల ప్రాణాలకు ప్రమాదం లేదు; సింగపూర్ వైద్యుడు

By: chandrasekar Wed, 19 Aug 2020 12:23 PM

కరోనా వైరస్ ఉత్పరివర్తనం వల్ల ప్రాణాలకు ప్రమాదం లేదు; సింగపూర్ వైద్యుడు


శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ ఉత్పరివర్తనం చెందితే చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనివల్ల వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశమున్నా ప్రాణాలకు ప్రమాదం లేదని సింగపూర్‌ వైద్యుడు గుర్తించాడు. ఐరోపా లో ఎక్కువగా కనిపిస్తున్న, ఇటీవల మలేషియాలో కనుగొన్న కరోనావైరస్ కొత్త జాతి ప్రాణాంతక మైనది కాదని సింగపూర్‌లో నేషనల్ యూనివర్సిటీ సీనియర్ కన్సల్టెంట్, అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అధ్యక్షుడు పాల్ తాంబే వెల్లడించారు.

‘డీ 614జీ’ సింగపూర్‌లో కూడా కరోనా వైరస్‌ జన్యువును గుర్తించామన్నారు. కానీ, ఈ వ్యాఖ్యలపై సింగపూర్‌ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించలేదు. ఐరోపాలో వైరస్‌ మ్యుటేషన్ విస్తరణ పెరిగినా మరణాలరేటు తగ్గిందనేదానికి ఆధారాలున్నాయని తాంబే వెల్లడించారు. ఈ మ్యుటేషన్‌ తక్కువ ప్రాణాంతకమని నిర్ధారించినట్లు చెప్పారు. వైరస్‌ ఉత్పరివర్తన అనేది ప్రమాదకరమని ఇతర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ఇది టీకా సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. వైరస్‌ ఎక్కువ సంక్రమిస్తున్నా.. తక్కువ ప్రాణాంతకం కావడం మంచి విషయమని తాంబే అన్నారు. చాలా వైరస్‌లు మ్యుటేషన్‌ చెందినప్పుడు వాటి తీవ్రత తగ్గిపోతుందన్నారు.

Tags :
|
|

Advertisement