Advertisement

  • బాణాసంచాపై నిషేధంతో వెలవెలబోతున్న శివకాశి పట్టణం

బాణాసంచాపై నిషేధంతో వెలవెలబోతున్న శివకాశి పట్టణం

By: Sankar Thu, 12 Nov 2020 6:42 PM

బాణాసంచాపై నిషేధంతో వెలవెలబోతున్న శివకాశి పట్టణం


బాణాసంచా హబ్‌గా పేరొందిన శివకాశిలో ఇప్పుడు దీపావళి జోష్‌ కనబడటం లేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాణాసంచా అమ్మకాలను నిషేధించడంతో శివకాశి కళ కోల్పోయింది.

తమిళనాడులోని విరుద్‌నగర్‌ జిల్లాలోని చిన్న పట్టణం శివకాశిలో ప్రతి కుటుంబం ప్రత్యక్షంగా, పరోక్షంగా బాణాసంచా తయారీతో ముడిపడిఉంది. శివకాశిలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరికీ బాణాసంచా అమ్మకాలకు సంబంధించి ప్రతి భవనంపైనా భారీ బ్యానర్లు కనిపిస్తాయి. పట్టణ ప్రజలకు భారీ డిస్కౌంట్‌పై బాణాసంచాను విక్రయిస్తుంటారు.

బాణాసంచాపై నిషేధం ఇక్కడి కార్మికులపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. శివకాశిలో ప్రతి 12 మీటర్ల దూరంలో ఒక బాణాసంచా తయారీ యూనిట్‌ ఉంటుంది. వీటిలో ప్రతి చిన్న గదిలో కనీసం నలుగురు మహిళలు వాయువేగంతో తమకు కేటాయించిన పనులను చక్కబెడుతుంటారు. వీరిలో చాలా మంది తమ చిన్నతనం నుంచే బాణాసంచా పరిశ్రమలో పనిచేస్తుండగా మరికొందరు 18 సంవత్సరాల వయసు నుంచే ఈ వృత్తిలో పనిచేస్తున్నారు.


Tags :
|

Advertisement