Advertisement

  • సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదు, భవిష్యత్తులో రాదు..పిడుగులాంటి వార్త చెప్పిన టెడ్రోస్

సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదు, భవిష్యత్తులో రాదు..పిడుగులాంటి వార్త చెప్పిన టెడ్రోస్

By: chandrasekar Tue, 04 Aug 2020 11:37 AM

సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదు, భవిష్యత్తులో రాదు..పిడుగులాంటి వార్త చెప్పిన టెడ్రోస్


ఇటీవలే కరోనావైరస్ ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ఉండవచ్చని పిడుగులాంటి వార్త చెప్పిన ప్రపంచం ఆరోగ్య సంస్థ ఇప్పుడు అంతకన్నా కలవరపెట్టే వార్త చెప్పింది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరో బాంబులాంటి వార్త చెప్పింది. ప్రపంచంలోని అనేక దేశాలు కరోనావైరస్ కు మందు కనుక్కోవడానికి ప్రయత్నిస్తుున్నాయని కోట్లాది మంది వ్యాక్సిన్ పై ఆశలు పెట్టుకున్నారు.

కానీ వ్యాక్సిన్ కోసం వేచి చూడటం కన్నా నివారణ చర్యలు తీసుకోవడంపై ఫోకస్ పెట్టడం మంచిది అని డబ్యూహెచ్ఓ డైరక్టర్ టెడ్రోస్ ఆధ్నామ్ ఘాబ్రియోసిస్ తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా దిగ్గజ ఫార్మా సంస్థలు వ్యాక్సీన్ కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే కరోనాకు సిల్వర్ బుల్లెట్ సమాధానం ఎప్పటికీ దొరకదని తెలిపారు టెడ్రోస్. ప్రస్తుతం సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అది భవిష్యత్తులో రాదు అని చావు పిడుగలాంటి వార్త తెలిపారు.

కరోనావైరస్ ను కట్టడి చేయాడానికి టెస్టులు నిర్వహించి కాంటాక్ట్ ట్రేసింగ్, భౌతిక దూరం, మాస్కు పెట్టుకోవడం వంటి మనకు తెలిసిన చిట్కాలు పాటిండం బెస్ట్ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Advertisement