Advertisement

  • రహానే కు అదేమీ పెద్ద భారం కాదు ..సునీల్ గవాస్కర్

రహానే కు అదేమీ పెద్ద భారం కాదు ..సునీల్ గవాస్కర్

By: Sankar Mon, 14 Dec 2020 12:45 PM

రహానే కు అదేమీ పెద్ద భారం కాదు ..సునీల్ గవాస్కర్


టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో తొలిటెస్ట్ తర్వాత ఇండియాకు తిరిగిరానున్న విషయం తెలిసిందే..తన భార్య స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ డెలివరీ అవుతుండటంతో కోహ్లీ ఇండియాకు తిరిగి వస్తున్నాడు...

అయితే కోహ్లీ లేకపోవడం వలన టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ రహానే టీమిండియాకు తర్వాత మూడు టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు..అయితే ఇది రహానే మీద ఎటువంటి ఒత్తిడిని చూయించదు అని అన్నాడు టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ..

భారత జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం రహానెకు ఇంతకముందు ఉందని... ఒక వైస్ కెప్టెన్‌కు ఇది పెద్ద భారం కాదు.. అయిన రహానే కేవలం ఈ మూడు మ్యాచ్ లకు కెప్టెన్ అని గవాస్కర్ అన్నారు. అయితే రహానే గతంలో రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు. అందులో ఒకటి ఒకటి ఆస్ట్రేలియా కు వ్యతిరేకంగానే... అయితే ఈ రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది. అలాగే ప్రస్తుతం ఆసీస్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో విజయం సాధించి కెప్టెన్ గా ఓ సెంచరీ సాధించి బ్యాట్సమెన్ గా తానేంటో నిరూపించుకున్నాడు

Tags :
|

Advertisement