Advertisement

  • డబుల్‌బెడ్‌రూం ఇండ్లతో వారి సంతోషానికి అవధులే లేవు...

డబుల్‌బెడ్‌రూం ఇండ్లతో వారి సంతోషానికి అవధులే లేవు...

By: chandrasekar Fri, 11 Dec 2020 1:12 PM

డబుల్‌బెడ్‌రూం ఇండ్లతో వారి సంతోషానికి అవధులే లేవు...


అన్ని సౌకర్యాలతో డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కల్పించడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. సిద్దిపేటలోని నర్సపురం వద్ద కేసీఆర్‌ నగర్‌ పేరిట నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల సముదాయంలో గురువారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా గృహ ప్రవేశాలు నిర్వహించారు. ఇంటిముందు రంగవల్లులు, గుమ్మాలకు తోరణాలతో బంధువుల మధ్య లబ్ధిదారులు సంబురంగా గృహ ప్రవేశాలు జరుపుకొన్నారు. ఆత్మగౌరవంతో ఇంటిలోకి అడుగుపెట్టారు. వ్రతాలు చేసి ఇంటి ఆడపడుచులకు ఒడిబియ్యం పోశారు. ఇల్లు కట్టించిన దేవుడే మా ఇంటికొచ్చారంటూ సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ఏమిచ్చి రుణం తీర్చుకుంటామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పైలాన్‌ ప్రారంభించారు.

సర్వమత ప్రార్థనలు అనంతరం అధికారులతో గ్రూప్‌ ఫొటో దిగారు. సమీకృత మార్కెట్‌ను, ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ హాల్‌ను ప్రారంభించారు. బ్లాక్‌నంబర్‌-9లో లబ్ధ్దిదారులచే మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌ హుస్సేన్‌, రఘోత్తంరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డిలతో కలిసి సీఎం కేసీఆర్‌ గృహప్రవేశాలను చేయించారు. సిద్దిపేట సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ మంత్రి హరీశ్‌రావును ఆణిముత్యమన్నారు. ఈ మాటకు ఒక ప్రత్యేకత ఉంది. 2014 డిసెంబర్‌ 10న సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా అణిముత్యం అని సంబోధించిన సీఎం కేసీఆర్ సరిగ్గా ఆరేండ్ల తర్వాత 2020 డిసెంబర్‌ 10న అదే మాట పలుకడం విశేషం.

Tags :
|

Advertisement