Advertisement

విజయవాడలో ఓపెన్ కానున్న థియేటర్లు ...

By: chandrasekar Wed, 04 Nov 2020 7:03 PM

విజయవాడలో ఓపెన్ కానున్న థియేటర్లు ...


దేశ వ్యాప్తంగా కరోనావైరస్ వల్ల కొన్ని నెలల పాటు మూసుకుపోయిన థియేటర్లు ఈ మధ్యే తెరుచుకుంటున్నాయి. విజయవాడలో కూడా థియేటర్లు త్వరలో ఓపెన్ కానున్నాయి. దీంతో మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం విజయవాడలో ఉన్న ఎగ్జిబిటర్లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నగరంలో ఉన్న థియేటర్లను తెరవడానికి నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఇటీవలే కాలంలో ఏ మూవీ కూడా విడుదల తేదీని ప్రకటించలేదు. దాంతో సరిలేరు నీకెవ్వరు వంటి హిట్ సినిమాలు షోలు వేద్దామని నిర్ణయించారు. కాగా వైజాగ్ లో ఇప్పటికే కొన్ని థియేటర్లు, మల్టిప్లెక్సులు సినిమా షోలు వేయడం ప్రారంభించాయి. అయితే సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆక్యుపెన్సీ శాతం చాలా తక్కువగా ఉంది. మరో వైపు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర థియేటర్లను తెరిచే విషయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Tags :
|

Advertisement