Advertisement

  • దేశంలోనే తొలిసారిగా లవ్‌ జిహాద్‌ వ్యతిరేక చట్టం అమల్లోకి తెచ్చిన యోగీ సర్కారు...

దేశంలోనే తొలిసారిగా లవ్‌ జిహాద్‌ వ్యతిరేక చట్టం అమల్లోకి తెచ్చిన యోగీ సర్కారు...

By: chandrasekar Sat, 28 Nov 2020 7:53 PM

దేశంలోనే తొలిసారిగా లవ్‌ జిహాద్‌ వ్యతిరేక చట్టం అమల్లోకి తెచ్చిన యోగీ సర్కారు...


సుప్రీంకోర్టు లవ్‌ జిహాద్‌కు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసినా, విపక్షాలు వ్యతిరేకిస్తున్నా అవేవీ లెక్కచేయకుండా యూపీలోని యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారు తాజాగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ ఆనందీబెన్ పటేల్‌ సంతకం చేశారు. దీంతో దేశంలోనే తొలిసారిగా లవ్‌ జిహాద్‌ వ్యతిరేక చట్టం అమల్లోకి వచ్చింది. ముస్లిం యువకులు హిందూ యువతులను ట్రాప్‌ చేసి వివాహం చేసుకోవడాన్ని "లవ్‌ జిహాద్‌"గా పేర్కొంటున్న బీజేపీ, దాని అనుబంధ సంస్ధలు దీనిపై పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నాయి. యూపీలోని యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారు మరో అడుగు ముందుకేసి లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా ఓ చట్టాన్నే చేసేసింది. ముస్లిం యువకులు ఉద్దేశపూర్వకంగా హిందూ యువతులను మతం మారుస్తున్నారని ఆక్షేపిస్తూ తాజాగా ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చింది. దీనికి గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్ ఆమోదముద్ర వేశారు.

తాజాగా అమల్లోకి వచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారం మైనర్లు, ఎస్సీ, ఎస్టీ యువతులను బలవంతంగా మతమార్పిడి చేయడం నిషేధం. అలా బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే మూడేళ్ల నుంచి పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. దీంతో పాటు 25 వేల రూపాయల జరిమానా కూడా ఉంటుంది. ఎక్కువమందిని ఒకేసారి మతమార్పిడి చేస్తే మూడేళ్ల నుంచి పదేళ్ల జైలుశిక్షతో పాటు 50 వేల జరిమానా విధిస్తారు. ఇలా జరిగిన వివాహాలను అనధికారికంగా గుర్తిస్తారు. పెళ్లి తర్వాత మతం మార్చుకోవాలనుకుంటే మాత్రం జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

Tags :

Advertisement