Advertisement

  • అమెరికా లో స్కూల్స్ తెరవడంతో జరిగిన ఘోరం...97 వేల మంది చిన్నారులకు కరోనా

అమెరికా లో స్కూల్స్ తెరవడంతో జరిగిన ఘోరం...97 వేల మంది చిన్నారులకు కరోనా

By: chandrasekar Tue, 11 Aug 2020 09:33 AM

అమెరికా లో స్కూల్స్ తెరవడంతో జరిగిన ఘోరం...97 వేల మంది చిన్నారులకు కరోనా


కరోనా వైరస్ మహమ్మారి ఇంకా ఎవ్వరిని వదలడం లేదు. పట్టి పీడిస్తూనే ఉంది. కొన్ని దేశాలైతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అలా భావించి స్కూల్స్ తెరవడంతో ఘోరం జరిగిపోయింది. ఏది అనుమానించారో అదే జరిగింది.

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది. కొన్నిదేశాల్లో అయితే ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మరి కొన్నిదేశాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ విద్యా సంవత్సరం స్కూళ్లను తెరిచేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ప్రారంభమయ్యాయి కూడా. అలా ప్రారంభించిన అమెరికా ఇప్పుడు చేసిన తప్పు తెలుసుకుంటోంది.

స్కూళ్లు తెరిచిన రెండు వారాల్లోనే అమెరికాలో ఏకంగా 97 వేల మంది చిన్నారులకు కరోనా వైరస్ సోకినట్టు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వెల్లడించింది. జూలై 16 నుంచి జూలై 30 మద్యకాలంలో దాదాపు లక్షమంది పిల్లలకు కరోనా సోకడంతో స్కూళ్లను తిరిగి తెరిపించే నిర్ణయంపై అధికారులు పునరాలోచనలో పడ్డారు.

మరోవైపు అమెరికాలో ఇప్పటివరకూ కరోనా వైరస్ బారిన పడ్డ 50 లక్షల మందిలో 3 లక్షల 38 వేల మంది పిల్లలేనని సీబీఎన్ న్యూస్ కూడా ప్రకటించింది. రానున్న కాలంలో పిల్లలకు కరోనా నిర్ధారణ పరీక్షల్ని మరింతగా పెంచాలని వాండర్ బిల్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. అు కరోనా కారణంగా అమెరికాలో దాదాపు 25 వేలమంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇటు తల్లిదండ్రులు కూడా ఆన్ లైన్ క్లాసులవైపే మొగ్గు చూపుతున్నారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ స్కూళ్లు వద్దంటున్నారు.

భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను తెరిచేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అమెరికాలో ఎదురైన పరిస్థితిని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓ విద్యా సంవత్సరం నష్టపోయినా ఫరవాలేదు కానీ..పిల్లల ప్రాణాలు ముఖ్యమంటున్నారు.

Tags :

Advertisement