Advertisement

  • ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా హాస్పిటల్‌ దక్షిణ ఢిల్లీలో

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా హాస్పిటల్‌ దక్షిణ ఢిల్లీలో

By: chandrasekar Wed, 24 June 2020 6:38 PM

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా హాస్పిటల్‌ దక్షిణ ఢిల్లీలో


ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా హాస్పిటల్‌ దక్షిణ ఢిల్లీలో అందుబాటులోకి రానుంది. పది రోజుల్లో చైనా నిర్మించిన దవాఖాన కంటే పది రెట్లు ఈ దవాఖాన పెద్దది. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో సౌత్‌ ఢిల్లీ, హర్యాన సరిహద్దు చత్తర్‌పూర్‌లోని రాధా స్వామి సత్సంగ్‌ బియాస్‌ కాంప్లెక్స్‌ను దవాఖానగా మార్చాలని నిర్మించాలని ఆప్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

సత్సంగ్‌ 29 ఎకరాల విస్తరించి ఉండగా, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్ర౦గా పని చేసి౦ది. సమావేశాల్లో 3లక్షల మ౦ది అనుచరులకు వసతినందించింది. 22 ఫుట్ బాల్ మైదానాల పరిమాణంలో ఉన్న సత్సంగ్‌ ప్రస్తుతం కొవిడ్‌-19 చికిత్స కేంద్రంగా మారుతోంది. ఢిల్లీలో పెరుగుతున్న కేసుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని, ఢిల్లీ ప్రభుత్వానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు సత్సంగ్‌ పర్యవేక్షిస్తున్న వికాస్ సేథీ తెలిపారు. పది రోజుల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ ను కిలిసి మా కాంపౌండ్ అప్పగించినట్లు చెప్పారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆర్ఎస్‌బీఎస్‌ 96 బెడ్లను సిద్ధం చేసింది.

జూలై ఒకటి నాటికి 10,200 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఈ నెల 18న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ మనీష్ సిసోడియా ఫెసిలిటీని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. జూన్ 30 నాటికి ఢిల్లీలో లక్ష వరకు కేసులు నమోదు కానున్నాయని అంచనాలుండగా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర సాయాన్ని కోరింది. సత్సంగ్‌ కాంప్లెక్స్‌లో 800 మంది జనరల్‌ డాక్టర్లు, 70 మంది స్పెషలిస్టులు, 1400 మంది నర్సులు ఇక్కడ పని చేయనున్నారు.

కేంద్ర హోంశాఖ ఆదేశాలమేరకు ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆస్పత్రిలో సేవలందించనున్నారు. కాగా, దవాఖానకు సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌గా నామకరణం చేయగా, గురువారం హోంమంత్రి అమిత్‌షా దవాఖానను ప్రారంభించనున్నారు. మరోవైపు కోవిడ్‌ రోగులకు ఆహారాన్ని అందిస్తామని రాధాస్వామి సత్సంగ్‌ తెలిపింది.

Tags :
|

Advertisement