Advertisement

  • బట్టతల దాచి, పెండ్లి సమయంలో విగ్‌ ధరించి మోసం చేశాడ౦టూ మహిళ ఫిర్యాదు!

బట్టతల దాచి, పెండ్లి సమయంలో విగ్‌ ధరించి మోసం చేశాడ౦టూ మహిళ ఫిర్యాదు!

By: chandrasekar Mon, 02 Nov 2020 4:21 PM

బట్టతల దాచి, పెండ్లి సమయంలో విగ్‌ ధరించి మోసం చేశాడ౦టూ మహిళ ఫిర్యాదు!


అబద్ధమాడి పెండ్లి చేసుకున్న తర్వాత నిజాలు తెలుసుకున్న ఓ మహిళ వాస్తవాలు దాచిన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ సదరు భర్త దాచిన వాస్తవం ఏంటంటే అతనికి బట్టతల ఉన్న విషయమేనంట.

ముంబైలో వృత్తిపరంగా చార్టర్ట్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల మహిళ గత నెలలో మీరా రోడ్‌లో నివాసముండే ప్రైవేటు ఉద్యోగిని పెండ్లి చేసుకున్నది. భర్తకు బట్టతల ఉన్న విషయాన్ని దాచిపెట్టి వివాహం కాస్తా ఘనంగా జరిపించారు.

అయితే, పెండ్లయిన రెండు రోజులకు భర్త బట్టతల నిజం బయటపడటంతో అతడి భార్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెండ్లి సమయంలో విగ్‌ ధరించి మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నది.

బట్టతల వాస్తవాన్ని దాచిపెట్టడమే కాకుండా పెండ్లయిన తర్వాత తనను అసహజమైన లైంగిక చర్యకు బలవంతం చేశాడని కూడా మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సెక్షన్ 498, 406, ఐపీసీ 377, సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు.

దాంతో భర్త ముందస్తు బెయిల్‌ కోసం థానే కోర్టును ఆశ్రయించాడు. పోలీసుల ఎదుట లొంగిపోవాలని థానే కోర్టు నిందితుడిని ఆదేశించింది. అతడిని త్వరలో అరెస్టు చేస్తామని సీనియర్ ఇన్‌స్పెక్టర్ కైలాష్ బార్వే పేర్కొన్నారు.

Tags :

Advertisement