Advertisement

  • పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ ఇప్పట్లో సాధ్యం కాదన్న WHO

పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ ఇప్పట్లో సాధ్యం కాదన్న WHO

By: chandrasekar Sat, 05 Sept 2020 09:50 AM

పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ ఇప్పట్లో సాధ్యం కాదన్న WHO


విస్తృతంగా కరోనా వాక్సిన్ తయారీలో నిమగ్నమైన వివిధ దేశాల్లోని పరిశోధన సంస్థలు వివిధ రకాల ట్రయల్స్ లో వున్నాయి. ప‌్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ఈ సమయంలో వాక్సిన్ పై మరింతగా ఎదురు చూడాల్సి వుంది. దీంతో ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వివిధ దేశాల్లోని దిగ్గ‌జ ఔష‌ధ సంస్థ‌లు వ్యాక్సిన్ తయారీలో బిజీబిజీగా ఉన్నాయి. ఇంత‌లోనే ర‌ష్యా, అమెరికా దేశాలు త‌మ వ్యాక్సిన్‌లు త్వ‌ర‌లోనే మార్కెట్లోకి రాబోతున్నాయంటూ ప్ర‌క‌ట‌న‌లు చేశాయి. వాస్త‌వానికి వారి వ్యాక్సిన్‌లు ఇంకా మూడో ద‌శ ట్ర‌య‌ల్స్‌లోనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

వైరస్ ప్రభావం రకరకాలుగా ఉండడం వల్ల కొవిడ్‌-19ను స‌మ‌ర్థంగా తిప్పికొట్టే విస్తృత వ్యాక్సినేష‌న్ ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌ని WHO పేర్కొన్న‌ది. వ‌చ్చే ఏడాది మ‌ధ్య‌కాలం, సుమారుగా 2021 జూన్, జూలై వ‌ర‌కు కూడా క‌రోనాను క‌ట్ట‌డి చేసే విస్తృత‌ వ్యాక్సిన్‌ను చూస్తామ‌ని తాము భావించ‌డంలేద‌ని WHO అధికార ప్ర‌తినిధి మార్గ‌రెట్ హ్యారిస్ అభిప్రాయ‌ప‌డ్డారు. శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన ఆమె వివిధ ఔష‌ధ సంస్థ‌లు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు క‌రోనాపై ఏ మేర‌కు ప్ర‌భావం చూపుతాయో, ఎంత‌వ‌ర‌కు ర‌క్ష‌ణ‌ క‌ల్పిస్తాయో త‌దిత‌ర అంశాలు తేలాల్సిన‌ అవ‌స‌రం ఉందని చెప్పారు.

వివిధ దశలలో జరిపిన ప్రయోగాల వివరాలు పరిశీలించాల్సి వుంది. వ్యాక్సిన్‌ల మూడో ద‌శ ప్ర‌యోగాల‌కు అధిక స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఆయా వ్యాక్సిన్‌లు క‌రోనా నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయా, ఒక‌వేళ ర‌క్ష‌ణ క‌ల్పిస్తే ఏ మేర‌కు సుర‌క్షితం అనే అంశాల‌ను జాగ్ర‌త్త‌గా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మార్గ‌రెట్ పేర్కొన్నారు. పరిస్థితులు మరియు వాతావరణం రోగి వయస్సు ఇలా అనేక విషయాల ఆధారంగా వాక్సిన్ పరీక్షించాల్సి వుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికి అందుబాటులో రావడం చాలా కష్టమని పరిశోధకులు చెపుతున్నారు.

Tags :

Advertisement