Advertisement

  • విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆచూకీ తెలియ లేదు...

విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆచూకీ తెలియ లేదు...

By: chandrasekar Fri, 18 Dec 2020 9:03 PM

విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆచూకీ తెలియ లేదు...


మియాపూర్‌కు చెందిన నరసింహారావు, ఉమానాగలక్ష్మి దంపతులకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఆచూకీ తెలియడం లేదని తల్లిదండ్రులు విలపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. గీతం వర్సిటీలో బీటెక్‌ పూర్తి చేసి, విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసేవాడన్నారు. 2019 జూలై 3న ఆఫీసుకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదన్నారు. ఆఫీసులో ఆరాతీస్తే మధ్యాహ్నం 12గంటలకు బయటకు వెళ్లాడంటూ చెప్పారట.

పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారన్నారు. నేటి వరకు ఆచూకీ తెలియలేదన్నారు. మంత్రి కేటీఆర్‌కు కూడా ట్విట్టర్‌ ద్వారా విషయాన్ని తెలిపామన్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, డీసీపీ వెంకటేశ్వర్లును కలిశామని, వారు తమకు సహకారం అందిస్తామని చెప్పారన్నారు. విప్రోలో ఉద్యోగం చేసే కొడుకు కనిపించకపోవడం వెనుక కారణాలు తేలలేదు. కొడుకు కనిపించకుండా పోయిన కొద్ది రోజుల క్రితం బ్యాంకు ఖాతా జీరో అని వచ్చిందని తండ్రి మీడియాకు వివరించారు.

కనిపించకుండా పోయిన రోజు తన కొడుకు పేరిట ఓ మెయిల్‌ వచ్చిందని, మెయిల్‌లో వచ్చిన సమాచారం తన కొడుకు పంపినదిగా లేదన్నారు. ఎవరో బలవంతంగానే ఆ మెయిల్‌ చేయించి ఉంటారని అంటున్నారు. గుర్తుతెలియని కారులో వెళ్లినట్లు అతని స్నేహితులు తెలిపారని, సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే తప్పకుండా ఆ కారు ట్రేస్‌ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పోలీసు అధికారులు అప్పుడు స్పందిస్తే కనీసం వివరాలు తెలిసేవన్నారు.

Tags :
|

Advertisement