Advertisement

  • భూతం పోగొడతానంటూ బాధిత యువతిని గదిలో బంధించి పలుమార్లు లైంగిక దాడి

భూతం పోగొడతానంటూ బాధిత యువతిని గదిలో బంధించి పలుమార్లు లైంగిక దాడి

By: chandrasekar Tue, 01 Sept 2020 2:11 PM

భూతం పోగొడతానంటూ బాధిత యువతిని గదిలో బంధించి పలుమార్లు లైంగిక దాడి


హర్యానాలోని సోనెపట్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో దెయ్యం ఉందని దాన్ని తన మంత్రాలతో తరిమేస్తానని నమ్మించిన ఓ భూత వైద్యుడు ఒక యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తమ కన్న కూతురు మానసికంగా చాలా డిస్టర్బ్ అవ్వడంతో, దంపతులు ఓ భూతవైద్యుడిని ఆశ్రయించారు. దీంతో వారి అనుమానాన్ని ఆసరాగా చేసుకున్న ఆ మోసగాడు దారుణానికి పాల్పడ్డాడు. స్థానికంగా కాస్త పేరు పొందిన భూతవైద్యుడు ఆలీషాల దంపతులు చెప్పింది విన్న తర్వాత, వారి ఇంట్లో దెయ్యం ఉందని, దాని వల్లే చెడు జరుగుతోందని వారిని నమ్మించాడు.

దెయ్యాన్ని ఇంట్లోంచి వెళ్లగొడితే అంతా మంచే జరుగుతుందని నమ్మించాడు. వారి ఇంటికెళ్లి ప్రార్థనలు చేశాడు.ఈ క్రమంలోనే దంపతుల కుమార్తె మీద కన్నేసిన ఆలీ భూతం పోగొడతానంటూ బాధిత యువతిని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఇంటికి వచ్చిన ప్రతీసారి వారి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే దంపతులు అసలు సంగతిని ఆలస్యంగా గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులను నిందితుడి కోసం వెదుకుతున్నారు.

Tags :
|

Advertisement