Advertisement

వ్యాక్సిన్ అందరికీ పంపిణీ చేయాలి... ట్రూడో

By: Dimple Thu, 16 July 2020 3:54 PM

వ్యాక్సిన్ అందరికీ పంపిణీ చేయాలి... ట్రూడో


కోవిడ్–19 వ్యాక్సిన్​ వచ్చిన తర్వాత అందరికీ సమానంగా ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్న దేశాల్లో కెనడా కూడా చేరింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని జస్టిన్​ ట్రూడో, స్పెయిన్​, న్యూజిలాండ్​, దక్షిణకొరియా, ఇథియోపియా సహా మరో మూడు దేశాలకు చెందిన దేశాధినేతలతో కలిసి రాసిన ఆర్టికల్​ వాషింగ్టన్​ పోస్టులో ప్రచురితమైంది.

‘వ్యాక్సిన్లు ప్రాణాలను కాపాడతాయి అందుకోసమే ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్​ను కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది. వ్యాక్సిన్​ ఎవరు కనుగొన్నా.. అది అందరికీ చేరాలి’ అంటూ ట్రూడో ట్వీట్​ కూడా చేశారు. ఈ మేరకు తనతో పాటు ఆర్టికల్​ రాసిన ఇతర దేశాధినేతలను ట్యాగ్​ చేశారు.

ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్–19 వ్యాక్సిన్​ మానవ ప్రయోగాల్లో మూడో దశకు, ప్రాథమిక టెస్టుల్లో మోడర్నా వ్యాక్సిన్​ పని తీరు మెరుగ్గా ఉందని వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రూడో ఈ కామెంట్లు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా 100కిపైగా వ్యాక్సిన్లను కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తున్నారు.

Tags :
|

Advertisement