Advertisement

  • తుది ఆమోదం పొందేందుకు అతి చేరువలో అమెరికా వాక్క్సిన్.

తుది ఆమోదం పొందేందుకు అతి చేరువలో అమెరికా వాక్క్సిన్.

By: chandrasekar Wed, 02 Sept 2020 3:59 PM

తుది ఆమోదం పొందేందుకు అతి చేరువలో అమెరికా వాక్క్సిన్.


అమెరికాలో ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ మూడో దశకు చేరుకున్నాయి. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. తుది ఆమోదం పొందేందుకు ఈ టీకా అతి చేరువలో ఉన్నదన్నారు.

అమెరికాలో ఆస్ట్రాజెనెకా టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ మూడో దశకు చేరుకున్నాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. ఇప్పటికే తుది దశలో ఉన్న వ్యాక్సిన్‌ల సరసన ఈ టీకా కూడా చేరింది. ఈ వ్యాక్సిన్‌కి అన్ని అనుమతులు లభిస్తాయని ఆశిస్తున్నా.

అసాధ్యం అనుకున్న పనులను కూడా అమెరికాలో మేము చేసి చూపిస్తున్నాం. టీకా అభివృద్ధికి, ట్రయల్స్‌కు ఏండ్ల వ్యవధి అవసరం. అయితే, మేము నెలల వ్యవధిలోనే దీన్ని తయారు చేసాం అని అన్నారు

Tags :
|
|
|

Advertisement