Advertisement

  • కరోనా ప్ర‌భావం వంద కోట్ల మంది విద్యార్థుల‌పై పడిందని ఐక్య‌రాజ్య‌స‌మితి వెల్లడి

కరోనా ప్ర‌భావం వంద కోట్ల మంది విద్యార్థుల‌పై పడిందని ఐక్య‌రాజ్య‌స‌మితి వెల్లడి

By: chandrasekar Wed, 05 Aug 2020 8:46 PM

కరోనా ప్ర‌భావం వంద కోట్ల మంది విద్యార్థుల‌పై పడిందని ఐక్య‌రాజ్య‌స‌మితి వెల్లడి


ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెరెస్ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ‌ల్ల సుమారు 160 కోట్ల మంది విద్యార్థుల చ‌దువుల‌కు బ్రేక్‌ప‌డింద‌ని అన్నారు.

మ‌హ‌మ్మారి వ‌ల్ల దెబ్బ‌తిన్న ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌తో దాదాపు 2.5 కోట్ల మంది విద్యార్థులు స్కూళ్ల నుంచి డ్రాపౌట్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి విద్యావ్య‌వ‌స్థ‌పై పెను ప్ర‌భావం చూపించిన‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి పేర్కొన్న‌ది.

ఎడ్యుకేష‌న్ మరియు కరోనా అంశంపై గుటెరెస్ వీడియో సందేశంలో మాట్లాడారు. జూలైలో సుమారు 160 దేశాల్లో స్కూళ్ల‌ను బంద్ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. దీంతో వంద కోట్ల మంది విద్యార్థులు చదువుల‌కు దూరం అయ్యారన్నారు. మ‌రో 4 కోట్ల మంది అత్యంత కీల‌క‌మైన ప్రీస్కూల్ ఇయ‌ర్‌ను కోల్పోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

Tags :
|

Advertisement