Advertisement

  • దేశంలో ఐదు రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

దేశంలో ఐదు రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

By: chandrasekar Wed, 09 Sept 2020 09:42 AM

దేశంలో ఐదు రాష్ట్రాల్లోనే  కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ


దేశంలో ఐదు రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ద‌ని, మరణాల రేటు కూడా తగ్గుతున్న‌ద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం తీరుతెన్నుల‌ను కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మీడియాకు వివ‌రించారు. అందరూ మాస్కులు ధరించి సామజిక దూరం పాటించినట్లైతే మరింత తగ్గవచ్చని తెలిపారు.

మన దేశంలో కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య తగ్గిందని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో క‌రోనా మరణాల రేటు 2.15 శాతం ఉండగా, ప్రస్తుతం అది 1.7కు చేరిందన్నారు. దాదాపు 14 రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 వేల కంటే తక్కువ కేసులు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. లక్షద్వీప్‌లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని రాజేశ్ భూష‌ణ్ చెప్పారు. దేశంలో ప్ర‌తి మిలియన్‌ జనాభాలో 3,102 కేసులు నమోదవుతున్నాయని, కేవలం 53 క‌రోనా‌ మరణాలే సంభవిస్తున్నాయని తెలిపారు.

మన దేశంలో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే క‌రోనా బాధితుల‌ సంఖ్య త‌క్కువ‌గా ఉన్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. దేశంలోని మొత్తం పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, యూపీ, తమిళనాడు రాష్ట్రాల్లో 62 శాతం ఉండ‌గా, మ‌ర‌ణాలు కూడా ఆ ఐదు రాష్ట్రాల్లోనే 70 శాతం ఉన్నాయ‌ని రాజేశ్ భూష‌ణ్ వెల్లడించారు. వాక్సిన్ తొందరగా వస్తే కరోనాని కట్టడి చేయవచ్చని వివరించారు. కరోనా వాళ్ళ దేశ ఆర్ధిక స్థితి మరింతగా క్షీణించినట్లు తెలిపారు.


Tags :

Advertisement