Advertisement

  • నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం

నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం

By: chandrasekar Thu, 30 July 2020 7:42 PM

నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం


కరోనా కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్న ఈ సమయంలో విద్యా విధానంలో సమూల మార్పులు వల్ల విద్యార్థులకు తగ్గిన సిలబస్ భారం మరియు కోర్సుల వ్యవధి. విద్యార్థులు దాదాపు ఆన్లైన్ ద్వారా ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారు. విద్యాలయాలకు వెళ్లలేని కారణంగా దేశంలో విద్యా విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ బుధవారం, జులై 29 ఆమోదం తెలిపింది.

విద్యార్థులపై కరికులమ్ భారం తగ్గించడమే నూతన విద్యా విధానం లక్ష్యమని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. పలు కోర్సుల కాల పరిమితిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

2030 నాటికి అందరికీ విద్య అందించాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. నూతన విద్యావిధానంపై ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

డిప్లొమా కోర్సు కాల వ్యవధి రెండేళ్లుగా, వృత్తి విద్యా కోర్సుకు ఏడాదిగా నిర్ణయించారు. విద్యా విధానంలో 34 ఏళ్లుగా ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్ర మంత్రులు గుర్తు చేశారు.

Tags :
|

Advertisement