Advertisement

దీపావళికి టపాసుల సాంప్రదాయ౦.🎆…🎆...🎆

By: chandrasekar Sat, 14 Nov 2020 06:14 AM

దీపావళికి టపాసుల సాంప్రదాయ౦.🎆…🎆...🎆


దీపావళి అంటే దీపాల పండుగ. చీకటి పై వెలుగు గెలిచిన వేడుక. రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజాలు ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ఏడాది రామమందిరం నిర్మాణం ప్రారంభం కావడంతో ఈ ఏడాది దీపావళికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. దీపావళికి దేశంలోని ప్రతి హిందువు తన ఇంటి ముందు దీపాలను వెలిగిస్తాడు. దివాళి అంటేనే వెలుగుల పండుగ. రావణుడిని ఓడించి.. 14 ఏళ్ల వనవాసం తర్వాత రామచంద్రమూర్తి అయోధ్యకు తిరిగి వచ్చినందుకు గానూ ప్రజలు ఆనందోత్సహాల మధ్య దీపావళిని చేసుకుంటున్నారు. ఆ వేడుకకు గుర్తుగానే ఈ ఏడాది అయోధ్య దీపాల కాంతులతో వెలుగులీనుతుంది.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలెవరూ బాణసంచా కాల్చొద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. పలువురు పర్యావరణ వేత్తలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. గాలి కాలుష్యం అవుతుందని చెప్పి కోర్టులు కూడా వీటిపై బ్యాన్ విధిస్తున్నాయి. అయితే దేశంలోని ఒక వర్గం ప్రజలకు ఇది కోపం తెప్పిస్తున్నది. మరి దీపావళికి బాణసంచ కాల్చడం ఎప్పట్నుంచి మొదలైందో తెలుసా..?

రాముడు అయోధ్యకు తిరిగివచ్చిన సందర్భంగా ప్రజలు ఆనందోత్సహాలతో.. దీపాలను వెలిగించి వేడుక చేసుకున్నారని మాత్రమే మనకు పురాణాలు చెబుతున్నాయి. ఏ గ్రంథంలోనూ అయోధ్య ప్రజలు బాణసంచా కాల్చారనడానికి తగిన ఆధారాల్లేవు. రామాయణంలోనే కాదు.. ఇతర గ్రంథాల్లోనూ ఇందుకు సంబంధించిన ప్రస్తావన లేదు.

the tradition,of postage,stamps,for diwali,crackers ,దీపావళికి, టపాసుల ,సాంప్రదాయ౦, ప్రజలెవరూ, బాణసంచా


అసలు బాణసంచా పుట్టింది ఎక్కడో తెలుసా..? మనతో నిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాలో. మందుగుండును కనుగున్నది అక్కడే. క్రి.శ 1000 వరకు మన గ్రంథాలలో పటాకుల ప్రస్తావనే లేదు. క్రి.శ 700 వ సంవత్సరం లతో చైనాలో టాంగ్ రాజవంశం వారు బాణసంచా కాల్చినట్టు ఆధారాలున్నాయన చరిత్రకారులు చెబుతున్నారు. ఆ కాలంలో బిగ్గరగా శబ్దాలు చేస్తే ఆత్మలు భయపడి మనుషుల చెంతకు రావని.. అందుకే పటాసులను కాల్చేవారని చైనా పూర్వీకులు నమ్మేవారట.

ఈ గన్ పౌడర్ ను అరబ్బులు.. చైనా నుంచి భారత్, ఐరోపాకు తీసుకువెళ్లారని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఆత్మలను బెదిరించడానికి ఉపయోగించిన మందుగుండు.. కాల క్రమేణా అన్ని కార్యక్రమాలకు ఉపయోగపడింది. ఇక నమ్మకాలు, విశ్వాసాలకు పెట్టని గోడలా ఉన్న భారత్ లో.. ఇది చెడు పై మంచి సాధించిన విజయంగా జరుపుకుంటున్నారు. ఇది ఒక్క దీపావళికే కాదు.. ప్రతి పండుగకు వ్యాపించింది. వాస్తవానికి భారత్ లో భాణసంచా వాడకం క్రీ.శ 1400 తర్వాతే మొదలైనట్లు దివంగత చరిత్రకారుడు పికో గొడె తన పుస్తకంలో రాశారు. భారత్ లో బాణసంచా చరిత్ర పై ఆయన 1950 లో ఏకంగా ఒక పుస్తకమే రాశారు.

Tags :
|

Advertisement