Advertisement

  • వందే భారత్ మిషన్‌ లో ఈ నెలలో షెడ్యూల్ చేసిన మొత్తం విమానాల సంఖ్య 746కు చేరుకుంది

వందే భారత్ మిషన్‌ లో ఈ నెలలో షెడ్యూల్ చేసిన మొత్తం విమానాల సంఖ్య 746కు చేరుకుంది

By: chandrasekar Fri, 07 Aug 2020 11:29 AM

వందే భారత్ మిషన్‌ లో ఈ నెలలో షెడ్యూల్ చేసిన మొత్తం విమానాల సంఖ్య 746కు చేరుకుంది


కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు వందే భారత్‌ మిషన్‌ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 9.5 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చామని విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. 'వందే భారత్ మిషన్‌లో మిలియన్ మందిని స్వదేశానికి తీసుకువచ్చాం.

కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో ఒంటరిగా మిగిలిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ ఇది. ఆగష్టు ఒకటో తేదీ నాటికి విదేశాల్లోని దాదాపు 9.5 లక్షల మంది భారత్‌కు చేర్చాం.

విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి శ్రీవాస్తవ 'ప్రస్తుతం వందే భారత్ మిషన్లో ఐదవ విడుత కొనసాగుతుంది’ అని తెలిపారు. డిమాండ్ ఆధారంగా మరో 60 విమానాలతో షెడ్యూల్‌ను పెంచామని, ఈ నెలలో షెడ్యూల్ చేసిన మొత్తం విమానాల సంఖ్య 746కు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Tags :

Advertisement