Advertisement

  • దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79 లక్షలు దాటింది

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79 లక్షలు దాటింది

By: chandrasekar Mon, 26 Oct 2020 4:57 PM

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79 లక్షలు దాటింది


కరోనా వాక్సిన్ ఇంకా అందుబాటులో రానందువల్ల వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. చాలా రోజుల తర్వాత 45వేలకు చేరువలో కేసులు నమోదు కాగా 500లకు తక్కువగా మరణాల సంఖ్య నమోదైంది. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా దేశంలో భారీగా తగ్గింది. దీంతోపాటు కోలుకున్న వారి శాతం కూడా రోజురోజుకు భారీగానే పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 90.23 శాతం ఉండగా మ‌ర‌ణాల రేటు 1.50 శాతం, యాక్టివ్ కేసుల రేటు 8.26 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ఆదివారం, అక్టోబరు 25న దేశవ్యాప్తంగా కొత్తగా 45,149 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 480 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో అన్ని రాష్ట్రాలలో కలిపి తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,09,960 కి చేరగా మరణాల సంఖ్య 1,19,014 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే దేశవ్యాప్తంగా ఆదివారం కరోనాతో 59,105 మంది కోలుకోగా ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి 71,37,229 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 6,53,717 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే ఆదివారం దేశవ్యాప్తంగా 9,39,309 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి అక్టోబరు 25 వరకు మొత్తం 10,34,62,778 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.


Tags :

Advertisement