Advertisement

  • మంత్రి పర్సనల్ అసిస్టెంట్ ను కిడ్నప్ చేసి వదిలిపెట్టిన దుండగులు

మంత్రి పర్సనల్ అసిస్టెంట్ ను కిడ్నప్ చేసి వదిలిపెట్టిన దుండగులు

By: chandrasekar Thu, 24 Sept 2020 6:23 PM

మంత్రి పర్సనల్ అసిస్టెంట్ ను కిడ్నప్ చేసి వదిలిపెట్టిన దుండగులు


మంత్రి పర్సనల్ అసిస్టెంట్ను కిడ్నప్ చేసిన దుండగులు మళ్ళీ అతనిని వదిలిపెట్టిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులో మంత్రి పీఏను కొందరు కిడ్నాప్ చేశారు. నలుగురు యువకులు తనను కిడ్నాప్ చేసినట్టు మంత్రి పీఏ తర్వాత తెలిపాడు. తమిళనాడులోని పశు సంవర్థక శాఖ మంత్రి ఉడుమలై కే. రాధాకృష్ణన్ పర్సనల్ అసిస్టెంట్ కర్ణన్‌ను బుధవారం ఉదయం కొందరు దుండగులు పట్టపగలే కిడ్నాప్ చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమలైపేటలోని నలుగురు యువకులు ఎమ్మెల్యే ఆఫీసు వద్దే అతడ్ని కిడ్నాప్ చేశారు.

కిడ్నాప్ చేసిన సంఘటన ఎమ్మెల్యే ఆఫీసు బయట ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం నలుగురు యువకులు ముఖానికి మాస్క్ లాంటిది కట్టుకున్నారు. ఓ కారులో వచ్చారు. కారును ఎమ్మెల్యే ఆఫీసు బయట ఉంచారు. ఆ నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యే ఆఫీసు లోపలికి వెళ్లారు. మరో యువకుడు కారు వద్దే ఉన్నాడు. లోపలికి వెళ్లిన ముగ్గురు యువకులు మంత్రి పీఏ కర్ణన్ ను కిడ్నాప్ చేసి బయటకు లాక్కొస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

కర్ణన్‌ను ఆ నలుగురు లాక్కొచ్చిన అనంతరం అతడిని కారులోకి నెట్టారు. ఈ ఘటన ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. అయితే, కొన్ని గంటల్లోనే బాధితుడిని వదిలేశారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతడిని వదిలేసినట్టు తెలిసింది. కొన్ని పత్రాల మీద సంతకాలు పెట్టించుకుని వారు కర్ణన్‌ను వదిలిపెట్టారు. రాధాకృష్ణన్ కార్యాలయానికి 8 కిలోమీటర్ల దూరంలో పీఏను విడుదల చేశారు. పత్రాల మీద సంతకాలు చేయించుకున్న తరువాత విడిచి పెట్టినట్లు తెలిపాడు.

కిడ్నప్ చేసిన తరువాత జరిగిన సంఘటన గురించి కర్ణన్ స్పందిస్తూ డబ్బు కోసం వారు తనని బెదిరించినట్లు తెలిపాడు. మూడు గొలుసులు, ఓ ఉంగరాన్ని తీసుకున్నారు. డబ్బు అడిగారు కానీ తాను పర్సు తీసుకెళ్లలేదన్నాడు. తన ఏటీఎం పిన్ నెంబర్ అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. కిడ్నాపర్లు ముసుగులు, టోపీలు ధరించిన కారణంగా గుర్తించలేదన్నారు. అయినప్పటికీ వారు స్థానికలుగానే పేర్కొన్నాడు. కరోనా వల్ల మోకానికి ముసుగు పెట్టుకోవడంతో దుండగుల గురించి ఎవ్వరికి అనుమానం రాలేదు.

Tags :

Advertisement