Advertisement

పోలీసు రివాల్వర్‌నే కొట్టేసిన దొంగ

By: chandrasekar Mon, 23 Nov 2020 4:03 PM

పోలీసు రివాల్వర్‌నే కొట్టేసిన దొంగ


పోలీసు రివాల్వర్‌నే ఓ దొంగ కొట్టేసాడు. దీనికోసం వివరాలు పరిశీలిస్తే జైలులో శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి ఐదుగురు పోలీసులు అద్దెకు ఉంటున్న ఇంట్లోకి చొరబడి రివాల్వర్‌తో పాటు పది బులెట్లను దొంగిలించాడు. ఆ రివాల్వర్‌తో జ్యూవెలరీ షాప్ యజమానులను బెదిరించి చోరీలకు పాల్పడాలని భావించాడు. అయితే నిందితుడి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. సెంట్రల్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్ పోలీసు సంజయ్ భాటియా తెలిపిన వివరాల ప్రకారం దోపిడి కేసులో అరెస్ట్ అయి ఈ ఏడాది సెప్టెంబర్‌లో జైలకు వెళ్లాడు. ఆ తరువాత పెరోలుపై బయటకు వచ్చాడు. 45 రోజులు పెరోల్ గడువు ముగిసిన తర్వాత అతడు నవంబర్ 30న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే పెరోల్‌పై బయటకు వచ్చిన అతుల్ తన పద్దతి మార్చుకోలేదు. తిరిగి దొంగతనాలు చేయసాగాడు. ఈ క్రమంలోనే దక్షిణ ఢిల్లీలోని కిషన్‌ఘర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చోరికి వెళ్లాడు. అయితే అందులో ఐదుగురు పోలీసులు అద్దెకు ఉంటున్నారనే విషయం అప్పుడు అతనికి తెలియదు. మాములుగా దొంగతనం చేయడానికి వచ్చాడు.

అతడు ఆ ఇంట్లో చోరి చేసే సమయంలో ఓ బ్యాగ్‌లో ఢిల్లీలో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రివాల్వర్ కనిపించింది. దీంతో అతడు రివాల్వర్, పది బులెట్లను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే తన రివాల్వర్ కనిపించక పోవడం కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో పోలీసు శాఖ రివాల్వర్‌ను దొంగిలించిన వ్యక్తి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టింది. ఇక, అతుల్ తొలుత ఆ రివాల్వర్‌ను మంచి ధరకు బయట అమ్మవచ్చని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత తన పాట్నర్స్ విపిన్, విశాల్‌లతో కలిసి దోపిడిలకు ప్లాన్ చేశాడు. రివాల్వర్‌తో బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకోవాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కరోల్ బాగ్ ప్రాంతంలో బంగారం చోరికి ప్లాన్ వేయడానికి అక్కడికి వచ్చాడు. అదే సమయంలో రివాల్వర్ దొంగిలించిన వ్యక్తి గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతుల్‌ను అరెస్ట్ చేశారు. ఇక, ఈ కేసుకు సంబంధించి అతుల్ పాట్నర్స్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరికి గురైన రివాల్వర్, బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ పొలిసు ఊపిరి పీల్చుకున్నాడు.

Tags :
|

Advertisement