Advertisement

  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలను సబ్సిడీకి అమ్మాలని నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలను సబ్సిడీకి అమ్మాలని నిర్ణయం

By: chandrasekar Mon, 26 Oct 2020 1:13 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలను సబ్సిడీకి అమ్మాలని నిర్ణయం


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలను సబ్సిడీ ధరలకు అమ్మాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మొదటి వారం నుంచి ఉల్లి ధరలు ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రీటైల్, కిరాణా షాపుల్లో వారు పెట్టిన ధరలకు ఉల్లిని కొనలేక ఇబ్బంది పడుతున్నారు. హోల్ సేల్ ధరలపై కూరగాయలు అమ్మే రైతు బజార్ లో కూడా రూ.80-90 లకు కిలో ఉల్లిపాయలను అమ్ముతున్నారు. ఇక మార్కెట్ లో అయితే రూ.100 కిలో ఉల్లిపాయలు అమ్ముతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలను సబ్సిడీకి అమ్మాలని అని నిర్ణయించింది.

ప్రజల అవసరాలు తీర్చడం కోసం హైదరాబాద్ నగరంలో ఉన్న 11 రైతు బజార్లలో రూ.35 ప్రతీ కిలో అమ్మనుంది. ఐడెంటిఫికేషన్ కార్డులు చూపించి ప్రతీ వ్యక్తి రెండు కిలోల వరకు హైదరాబాద్ రైతు బజార్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాల్స్ లో కొనుగోలు చేయవచ్చు. పండగ సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి దీనిపై చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ నిర్ణయంతో మార్కెటింగ్ శాఖను ఉల్లిపాయలను రూ.35కు కిలో లెక్కన అమ్మమని సూచించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాల వల్ల పంటలకు నష్టం కలగింది. దీంతో అనుకున్న స్థాయిలో పంట చేతికి అందలేదు. దీంతో ఉల్లి ధరలకు లెక్కలొచ్చాయి. ప్రతి వంటల్లో వాడే ఉల్లి ధరలు భారీగా పెరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Tags :

Advertisement