Advertisement

  • కరోనా పేషెంట్లకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

కరోనా పేషెంట్లకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

By: chandrasekar Mon, 27 July 2020 4:59 PM

కరోనా పేషెంట్లకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం


కరోనా పేషెంట్లకు ప్రైవేట్ ఆస్పత్రులు ఏ విధమైన చికిత్సకు ఎంత వసూలు చేయాలనే అంశంపై గతంలో ఓ జీవో జారీ చేసింది. అయితే, తాజాగా ఆ ఆదేశాలకు అదనంగా తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరికొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. తాజా ఆదేశాల ప్రకారం కరోనా సోకిన పేషెంట్ హెల్త్‌ ఇన్సూరెన్స్ కింద ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన ధరలు వర్తించవు. స్పాన్సర్లు, కార్పొరేట్ సంస్థలు ఆస్పత్రులతో ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు చేసుకుని ఆ ఒప్పందాల కింద కరోనాకు చికిత్స చేయించుకోవాలనుకునే వారికి కూడా ప్రభుత్వం చెప్పిన ధరలు వర్తించవు.

ఒకరోజుకు...గతంలో ప్రకటించిన ధరలు


వెంటిలేటర్‌తో ఐసీయూలో చికిత్స రూ.9000
వెంటిలేటర్ లేకుండా ఐసీయూ చికిత్స రూ.7500
ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా టెస్ట్ ధర రూ.2200
ఐసోలేషన్ వార్డులో చికిత్స రూ.4000

తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా వైరస్ పేషెంట్ల నుంచి భయంకరంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు విమర్శలు వచ్చాయి. ఓ ఆస్పత్రి కరోనా చికిత్సకు రూ.13 లక్షలు బిల్లు వేసింది. అందులో రూ.6 లక్షలు చెల్లించనందుకు కరోనాతో చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ కూడా ఇవ్వడానికి నిరాకరించింది. ఈ క్రమంలో బాధితుడి కుటుంబం హైకోర్టును ఆశ్రయించడంతో వెనక్కి తగ్గి బిల్లులు మాఫీ చేసింది. ఇక మరో ఆస్పత్రి రూ.23 లక్షల వరకు బిల్లు వేసినట్టు ప్రచారం.

Tags :

Advertisement