Advertisement

  • పూరీలోని జగన్నాథస్వామి రథయాత్రకు అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం

పూరీలోని జగన్నాథస్వామి రథయాత్రకు అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం

By: chandrasekar Fri, 19 June 2020 12:21 PM

పూరీలోని జగన్నాథస్వామి రథయాత్రకు అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం


పూరీ జగన్నాథస్వామి రథయాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని సర్వోన్నత న్యాయస్థానం గురువారం అత్యవసర ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా రథయాత్రకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేయాలని పేర్కొంది. ప్రజారోగ్యం, పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పూరీలోని జగన్నాథస్వామి రథయాత్రకు అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రథయాత్ర నిర్వహిస్తే పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని, ఇది కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపించడానికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహించవద్దని సూచించింది. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదిగా పూరీ జగన్నాథ రథయాత్ర గుర్తింపు పొందింది.

జగన్నాథుని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు, ఆయన రథం మీద ఒక చేయి వేసేందుకు లక్షలాది ప్రజలు పూరీక్షేత్రానికి చేరుకుంటారు. ఏటా ఆషాఢశుద్ధ విదియ రోజున నిర్వహించే ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి భక్తులు లక్షల్లో హాజరవుతారు. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పర్వదినాలలో వైష్ణవభక్తుల సంబరాలకు అంతు ఉండదు.

supreme court,clear,jagannath swamys,rally in puri,will not be allowed ,పూరీలోని ,జగన్నాథస్వామి, రథయాత్రకు, అనుమతించబోమని, సుప్రీంకోర్టు స్పష్టం


పూరీ జగన్నాథుని ప్రత్యేకతలు ఒకటీ రెండూ కాదు. అసలు ఆ విగ్రహాలే తొలి ప్రత్యేకత. ఈ విగ్రహాలు చిత్రమైన రూపంలో ఉండటం వెనుక ఒక ఐతిహ్యాన్ని చెప్పుకున్నప్పటికీ, స్థానిక తెగలు ఆరాధించే రూపంలో ఈ మూర్తులు ఉండటం ఒక విశేషం. దానికి అనుగుణంగా జగన్నాథుని చరిత్రలో ఆయనను ఆదిమజాతివారు ఆరాధించుకున్న ప్రస్తావనలు కూడా కనిపిస్తాయి.

ఇక ప్రతి 12 లేక 19 ఏళ్లకు ఓసారి ‘నవకళేబర’ పేరుతో ఈ దారు విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఉంచడం మరో విశేషం. సాధారణంగా ఏ ఆలయంలోనైనా రథయాత్ర జరిగినప్పుడు ఉత్సవ విగ్రహాలను ఊరేగించడం ఆనవాయితీ. కానీ అందుకు విరుద్ధంగా సాక్షాత్తూ మూలవిరాట్టులే రథయాత్రకు కదిలిరావడం ఒక అద్భుతం. ఇక స్వామివారు

సతీసమేతంగా కాకుండా అన్నాచెల్లెల్లతో గర్భాలయంలో కొలువై ఉండటం విచిత్రం. రథయాత్రలో భాగంగా ఉన్నతమైన రథాల మీద జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలు... సమీపంలోని గుండిచా ఆలయానికి బయల్దేరి వెళతారు. గుండిచా మందిరం వారి పిన్నిగారి స్వస్థలమనీ, జగన్నాథుని ఉద్యానవనమనీ ప్రతీతి. ఆషాఢశుద్ధ దశమి వరకూ ఆ ఆలయంలో విశ్రమించిన జగన్నాథుడు తన గర్భాలయానికి తిరుగు ప్రయాణం కట్టడంతో రథయాత్ర ముగుస్తుంది.

Tags :
|

Advertisement