Advertisement

కంగనాని టార్గెట్ చేసిన ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం

By: chandrasekar Tue, 08 Sept 2020 9:00 PM

కంగనాని టార్గెట్ చేసిన  ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం


సుశాంత్ సింగ్ మ‌ర‌ణించిన ద‌గ్గ‌ర నుండి కంగ‌నా ర‌నౌత్ ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ వ‌స్తుంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో పాటు ముంబై పోలీసుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్న కంగనాని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తుంది. సోమ‌వారం ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయంపై బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. దీనిపై స్పందించిన క‌ంగనా 15 ఏళ్ళ క‌ష్టానికి ప్ర‌తి ఫ‌లం ముంబైలోని మ‌ణిక‌ర్ణిక కార్యాల‌యం. ఇందులోకి బీఎంసీ అధికారులు బ‌ల‌వంతంగా చొర‌బ‌డ్డారు. అన్ని కొల‌త‌లు చూసుకున్నారు. ఆమె ప్ర‌వ‌ర్త‌నకు మూల్యం చెల్లించాల్సిందే అంటూ వారు బెదిరించార‌ని కంగ‌నా పేర్కొంది.

తన వద్ద అన్ని పేపర్లు ఉన్నాయని, బీఎంసీ అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. తన ప్రాపర్టీలో ఒక్క ఇల్లీగల్ విషయం కూడా లేదని స్పష్టం చేశారు కంగ‌నా. రేపు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆఫీసును కూల్చేస్తారని కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ సర్వేలో భాగంగానే తనిఖీలు చేపట్టినట్లు చెప్పిన‌ బీఎంసీ అధికారులు ఈ రోజు ఆమె కార్యాల‌యానికి స్టాప్ వ‌ర్క్ నోటీసులు అతికించారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 / ఎ కింద, బిఎంసి సభ్యులు నటి కార్యాలయ గేటుపై మూడు పేజీల నోటీసును అతికించారు. అనుమతులు ఉంటే అధికారులకు చూపించాలని లేదంటే కూల్చివేత చర్యలు తప్పవని అధికారులు తేల్చిచెప్పారు. కొంత స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నట్లు తెలుస్తోందని, అందుకే తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Tags :
|

Advertisement