Advertisement

  • బీసీల విద్యా ప్రగతికి 1207 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం...

బీసీల విద్యా ప్రగతికి 1207 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం...

By: chandrasekar Mon, 09 Nov 2020 6:40 PM

బీసీల విద్యా ప్రగతికి 1207 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం...


తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమశాఖ విద్యాసంబంధ కార్యక్రమాల అమలు కోసం 1206.70 కోట్లు విడుదల చేసింది. మే నెల నుంచి అక్టోబర్‌ 31 వరకు ఆర్నెళ్ల వ్యవధిలో భారీగా నిధులు కేటాయించింది. ఈ నిధులను మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకులాలు, సాధారణ, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు, బీసీ హాస్టళ్లు, స్టడీ సర్కిళ్ల నిర్వహణకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.

మరోవైపు బీసీలు విద్యారంగంలో రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంతోపాటు బీసీ గురుకులాలను విస్తరించింది. సమైక్య రాష్ట్రంలో కేవలం 19 బీసీ గురుకులాలే ఉండగా తెలంగాణ ఆవిర్భవించిన తరువాత వాటి సంఖ్యను 302కు పెంచింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ పేద విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్‌ విద్యానిధి స్కాలర్‌షిప్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తున్నది.

దీంతో బీసీ వర్గాల వారు పోటీ పరీక్షల్లో రాణించేందుకు స్టడీ సర్కిళ్లను నిర్వహిస్తున్నది. వాటి నిర్వహణకు నిరంతరాయంగా నిధులు కేటాయిస్తూ ఉద్యోగాలు సాధించేందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. కరోనా కష్టకాలంలోనూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇవ్వడం విశేషం. కరోనా కష్టకాలంలోనూ విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా భారీగా విడుదల చేసిన నిధులే ఇందుకు నిదర్శనం.

Tags :

Advertisement