Advertisement

స్పుత్నిక్‌-వీ టీకా 92% పనిచేస్తున్నది: రష్యా

By: chandrasekar Thu, 12 Nov 2020 3:12 PM

స్పుత్నిక్‌-వీ టీకా 92% పనిచేస్తున్నది: రష్యా


మాస్కో: తాము అభివృద్ధి చేసిన కరోనా‌ టీకా ‘స్పుత్నిక్‌-వీ’ కరోనా వైరస్‌పై 92% ప్రభావం చూపిస్తున్నట్టు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

గత వారం తమ టీకా వైరస్‌పై 90 శాతం ప్రభావం చూపిస్తున్నదని ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ ప్రకటించిన నేపథ్యంలోనే రష్యా ఈ ప్రకటన చేయడం గమనార్హం.

కరోనా సోకిన 20 మందిపై పరీక్షలు నిర్వహించి వైరస్‌ సామర్థ్యాన్ని అంచనా వేసినట్టు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్డీఐఎఫ్‌) తెలిపింది. స్పుత్నిక్‌-వీ టీకాను రష్యా సంస్థ గమాలయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది.

ఇది ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉ౦ది. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండానే టీకాను విడుదల చేశారని అప్పట్లో రష్యాపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement