Advertisement

  • ఎయిర్ కండీషనర్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం...

ఎయిర్ కండీషనర్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం...

By: chandrasekar Sat, 17 Oct 2020 1:12 PM

ఎయిర్ కండీషనర్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం...


కేంద్ర ప్రభుత్వం ఇదివరకే కలర్ టీవీల దిగుమతులను నిషేధించి౦ది. ప్రస్తుతం ఎయిర్ కండీషనర్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏసీల దిగుమతులను నిషేధించింది. భారత్‌లో రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండీషనర్లను దిగుమతి చేసుకునే అవకాశం లేదని, భారత్ వాటిపై నిషేధం విధించింది. అదే విధంగా ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా భారత్‌లో ఆ తరహా ఎసీల తయారీ పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చైనాకు చెక్ పెట్టడంతో పాటు భారత్‌లో ఉత్పతాదకత పెంచేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. డీజీఎఫ్‌టీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఈ ఏడాది వివిధ రంగాల్లో స్వావలంబన కోసం ప్రభుత్వం ముందుకు రావాలని నిర్ణయం తీసుకుంది. భారత్ 30 శాతం ఏసీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.

భారత్ లో రిఫ్రిజిరేటర్లతో ఎయిర్ కండీషనర్లను దిగుమతి చేసుకునే అవకాశం లేదు. భారత్ వాటిపై నిషేధం విధించింది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఆ తరహా ఎసీలను భారత్ లో తయారి పెంచడానికి గానూ ఈ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఎయిర్ కండీషనర్ల దిగుమతిని భారత్ నిషేధంచిందని విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లాంటి పథకాలతో దేశీయంగానే ఉత్పాదకత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని ఆయన తెలిపారు. భారత్ అధికంగా దిగుమతి చేసుకునే కలర్ టీవీలను సైతం కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో తాజాగా ఏసీలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

Tags :

Advertisement