Advertisement

  • రష్యా వాక్సిన్ ‘స్పుత్నిక్‌ వీ’ ను భారత్‌లో హెటిరో కంపెనీ ఉత్పత్తి

రష్యా వాక్సిన్ ‘స్పుత్నిక్‌ వీ’ ను భారత్‌లో హెటిరో కంపెనీ ఉత్పత్తి

By: chandrasekar Sat, 28 Nov 2020 3:07 PM

రష్యా వాక్సిన్ ‘స్పుత్నిక్‌ వీ’ ను భారత్‌లో హెటిరో కంపెనీ ఉత్పత్తి


కరోనా కోసం చాలా కంపనీలు వాక్సిన్ కోసం పోటీ పడుచున్న వేళ రష్యా వాక్సిన్ ‘స్పుత్నిక్‌ వీ’ ను భారత్‌లో హెటిరో ఉత్పత్తి చేయనున్నది. కరోనా కట్టడికి రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌ వీ’ టీకాను భారత్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా హెటిరో ఉత్పత్తి చేయనున్నది. ఈ మేరకు ‘రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌' (ఆర్డీఐఎఫ్‌), హెటిరో బయోఫార్మా మధ్య ఒప్పందం కుదిరింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా భారత్‌లో 10 కోట్లకుపైగా డోసులను ఉత్పత్తి చేయనున్నది.

ప్రస్తుతం ట్రయల్స్ లో వున్న ఈ వాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆర్డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ డెమిత్రివ్‌ మాట్లాడుతూ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో 40 వేల మందిపై పరీక్షలు జరుపగా ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు.

ఈ వాక్సిన్ మొదటి డోస్‌ ఇచ్చిన తర్వాత 21 రోజులకు రెండో డోస్‌ ఇచ్చామని, 42 రోజుల తర్వాత పరీక్షించగా వ్యాక్సిన్‌ 95 శాతం సామర్థ్యంతో పనిచేసిందన్నారు. హెటిరో ల్యాబ్స్‌ ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మురళీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ కరోనాపై పోరులో తాము భాగస్వామి అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. దీని వల్ల కరోనా కట్టడి చేయడానికి వీలవుతుంది.

Tags :
|

Advertisement