Advertisement

  • కరోనాని నియంత్రించాలంటే రోగ‌నిరోధ‌క శ‌క్తిలో భాగమైన T క‌ణాల పాత్రే కీలకం

కరోనాని నియంత్రించాలంటే రోగ‌నిరోధ‌క శ‌క్తిలో భాగమైన T క‌ణాల పాత్రే కీలకం

By: chandrasekar Fri, 18 Sept 2020 2:59 PM

కరోనాని నియంత్రించాలంటే రోగ‌నిరోధ‌క శ‌క్తిలో భాగమైన T క‌ణాల పాత్రే కీలకం


ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనాతో పోరాడడానికి శరీరంలో యాంటీబాడీల కంటే T క‌ణాల పాత్రే కీల‌కం అని ప‌రిశోధ‌కులు అంటున్నారు. కరోనావైరస్‌కి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా నిత్యం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే తాజాగా అమెరికాలోని లా జొల్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాల‌జీ ప‌రిశోధ‌కులు తాము చేసిన అధ్యయనంలో ఈ విష‌యాన్ని కనుగొన్నట్టు పేర్కొన్నారు. కరోనాని నియంత్రించాలంటే రోగ‌నిరోధ‌క శ‌క్తిలో భాగమైన T క‌ణాల పాత్రే కీలకంగా మారినట్టు ప‌రిశోధ‌కులు తేల్చిచెబుతున్నారు.

రక్తంలో ఉండే ఒక రకమైన తెల్ల రక్త కణాలనే ఈ టి సెల్స్ లేదా టి కణాలు అంటారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని సమన్వయపర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో యాంటీబాడీల‌తో పాటు T క‌ణాలు అధిక మోతాదులో ఉంటేనే వైర‌స్ తీవ్రతను త‌గ్గించే అవ‌కాశాలు ఉన్నాయని తమ అధ్యయనంలో తేలినట్టు పరిశోధకులు తెలిపారు. కరోనావైరస్‌కి చెక్ పెట్టేందుకు తయారవుతున్న కరోనా వ్యాక్సిన్స్ సైతం కరోనా వ్యాధిగ్రస్తుల శరీరంలో యాంటీబాడీలతో పాటు టి సెల్స్ కూడా పెంపొందించే విధంగా ఉండాలని అప్పుడే కరోనాకి చెక్ పెట్టగలమని పరిశోధకులు సూచిస్తున్నారు.

తమ అధ్యయనం ఫలితాలకు సంబంధించిన నివేదికను సెల్ జ‌ర్న‌ల్‌లో ప్రచురించారు. ఇన్‌ఫెక్ష‌న్ అధికంగా ఉన్న వారిలో యాంటీబాడీల క‌ంటే టీ క‌ణాల ఆవశ్యకతే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా వైరస్ సోకిన 50 మంది రక్త నమూనాలను పరిశీలించినప్పుడు తమకు ఈ విషయం అర్థమైందని పరిశోధకులు తెలిపారు. కరోనావైరస్ తీవ్రత అధికంగా ఉన్న వారిలో టి కణాల సంఖ్య తక్కువగా ఉందని అలాగే టి కణాల సంఖ్య ఎక్కువగా ఉన్న వారిలో కరోనా ప్రభావం కూడా తక్కువగా ఉందని పరిశోధకులు ఓ నిర్ధారణకు వచ్చారు. 65 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు కరోనా తీవ్ర ఇబ్బందులకు గురిచేయడానికి కారణం కూడా వారి శరీరంలో ఈ T క‌ణాల సంఖ్య‌ తక్కువ‌గా ఉండ‌డమేనని అందువల్లే వారిలో కరోనా వ్యాధి తీవ్రతను త‌గ్గించం క్లిష్టంగా మారుతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు అభిప్రాయ౦ వ్యక్తం చేస్టషున్నారు.

Tags :
|
|
|

Advertisement