Advertisement

ఐఫోన్‌ 12 మోడళ్ల విడుదల ఆలస్యం కావచ్చు.

By: chandrasekar Fri, 24 July 2020 4:47 PM

ఐఫోన్‌ 12  మోడళ్ల విడుదల ఆలస్యం కావచ్చు.


యాపిల్‌ సరికొత్త ఐఫోన్లను ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో లాంచ్‌ చేస్తుంటుంది. స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 12 మోడళ్ల విడుదల ఈ ఏడాది ఆలస్యం కావచ్చు.

ఎల్‌టీఈ ఐఫోన్‌ 12 మోడళ్లను అక్టోబర్‌ చివరి వారంలో లాంచ్‌ చేయాలని యాపిల్‌ యోచిస్తుండగా 5జీ వేరియంట్లు నవంబర్‌ తర్వాత మార్కెట్లో అందుబాటులోకి తేవాలని చూస్తున్నది. ఈ ఏడాది యాపిల్ నాలుగు ఐఫోన్ మోడల్స్‌ను ఆవిష్కరిస్తుందని టాక్.

సెప్టెంబర్‌లోనే ఐఫోన్‌ 12 ఫోన్లను రిలీజ్‌ చేయాలనుకున్నప్పటికీ కరోనా సంక్షోభం కారణంగా విడుదల వాయిదా పడుతున్నదని ఐఫోన్ల తయారీతో సంబంధం ఉన్న కంపెనీ తెలిపింది. ఐఫోన్‌ 12 ప్రొ 6.1 అంగుళాలు లేదా 6.7 అంగుళాల సైజులో విడుదల కావొచ్చు.

ఇటీవల ఆవిష్కరించిన యాపిల్‌ ఐపాడ్‌ ప్రొ మాదిరిగా రియల్ కెమెరా మాడ్యుల్‌లో నాలుగు సెన్సార్లతో లైడార్‌ స్కానర్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

Tags :
|
|

Advertisement