Advertisement

  • రెడ్‌మి నోట్ 9 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 26న విడుదల...

రెడ్‌మి నోట్ 9 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 26న విడుదల...

By: chandrasekar Tue, 24 Nov 2020 6:27 PM

రెడ్‌మి నోట్ 9 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 26న విడుదల...


మార్కెట్లోకి మరో 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అవనుంది. రెడ్‌మి నోట్ 9 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 26న విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దాంతో పాటు రెడ్‌మి నోట్ 9 5G, రెడ్‌మి నోట్ 9 4G వేరియంట్లను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెడ్‌మి అధికారికంగా ప్రకటించింది. నోట్ 9 ప్రో మోడల్‌ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్‌తో పనిచేయనుందని సంస్థ జనరల్ మేనేజర్ లు వీబింగ్ పేర్కొన్నారు. గతంలో విడుదలైన Mi 10T Lite మోడల్‌లోనూ ఇదే ప్రాసెసర్‌ను అమర్చారు. రెడ్‌మి నోట్ 9 ప్రో 5G ఫోన్‌ను Mi 10T Lite మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రూపొందించారని గతంలో వార్తలు వచ్చాయి. వీబింగ్ చెప్పిన మాటలు ఈ వార్తలను ధ్రువీకరించేలా ఉన్నాయి. శక్తిమంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750G చిప్‌సెట్‌తో రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ ఫోన్‌ను తయారు చేశామని ఆయన అన్నారు. దీన్నే 10టీ మోడల్‌లోనూ వాడటం విశేషం. ఈ చిప్‌సెట్ 192 మిలియన్ పిక్సెల్ ఫోటోలు తీసేందుకు, 4K HDR వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

న్యూ ఫీచర్స్...

రెడ్‌మి నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో కెమెరా, మాక్రో లెన్స్‌తో కెమెరా సెటప్ ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రెడ్‌మి నోట్ 9 ప్రో డిజైన్‌ను గతంలోనే షియోమి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ డిజైన్‌లో తయారు చేశారు.

దీనికి వెనుక వైపు సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. రెడ్‌మి నోట్ 9ప్రో 5జీ 6.7 అంగుళాల హోల్-పంచ్ LCD డిస్‌ప్లేతో లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4,280 ఎంఏహెచ్ ఉండవచ్చు.

భారత్‌లో రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదలపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ గతంలో ఆ సంస్థ నుంచి వచ్చిన Mi 10T Lite మోడల్‌ను మన దేశంలో విడుదల చేయలేదు. దానికి రీ బ్రాండెడ్ వెర్షన్‌గా భావిస్తున్న రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ వేరియెంట్‌ను భారత్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags :

Advertisement