Advertisement

  • కరోనా నుంచి కోలుకునే ప్రక్రియ చాలా కాలం పడుతుంది

కరోనా నుంచి కోలుకునే ప్రక్రియ చాలా కాలం పడుతుంది

By: chandrasekar Fri, 17 July 2020 09:58 AM

కరోనా నుంచి కోలుకునే ప్రక్రియ చాలా కాలం పడుతుంది


కరోనావైరస్ సంక్రమణ రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కోలుకున్న తర్వాత రోగుల్లో తీవ్రమైన అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని అని క్లినికల్ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత సాధారణ స్థితికి రావడానికి రోగికి చాలా సమయం పడుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు.

భారతదేశంలో సుమారు 6 లక్షల మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇది శుభవార్త అయినప్పటికీ కరోనా నుంచి కోలుకునే ప్రక్రియ చాలా కాలం ఉంటుందని, కఠినమైనదని నిపుణులు చెప్తున్నారు. “కోలుకున్న తర్వాత రోగి సాధారణ స్థితికి రావడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టవచ్చు. కోలుకున్న రోగులలో అలసట, శ్వాస తీసుకోలేకపోవడం వంటి ఫిర్యాదు వస్తున్నాయి” అని మాక్స్ హెల్త్‌కేర్ డైరెక్టర్ మెడిసిన్ డాక్టర్ సందీప్ బుద్ధిరాజా చెప్పారు.

కరోనా రోగులకు చికిత్స చేసిన వివిధ హాస్పిటల్స్ లోని వైద్యులు కొన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక నాడీ సంబంధ ప్రభావాలను కూడా గుర్తించారు. వైరస్ మెదడును ప్రభావితం చేస్తుందని కూడా పలు పరిశోధనల్లో తేల్చారు.“కొంతమంది రోగులు నిరాశకు గురవుతారు. వారిలో భయం ఉంటుంది. ఇంతకుముందు, ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులను మాత్రమే ప్రభావితం చేస్తుందని తెలిసింది. కానీ ఇప్పుడు, ఇది గుండె, మెదడు, పేగు; మూత్రపిండాల వంటి ఇతర శరీర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుందని తేలింది” అని సర్ గంగారాం ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ మరియు పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ ధీరెన్ గుప్తా చెప్పారు.

"కరోనా వైరస్ ప్రభావం ఎండోథెలిటిస్‌కు దారితీస్తుంది. రక్త నాళాల లోపలి పొరను ప్రభావితం చేస్తుంది. కండరాలు, ఇతర శరీర అవయవాల నొప్పులకు కారణమవుతుంది. ఈ రోగులు స్ట్రోక్స్, తేలికపాటి గుండెపోటుకు గురవుతారు. కరోనా రోగుల్లో థ్రాంబోసిస్ లేదా రక్తం గడ్డకట్టడం వంటి సమస్య కూడా కనిపిస్తుంది. ఇటువంటి రోగులకు థ్రాంబోటిక్ థెరపీ అవసరమవుతుంది. దీర్ఘకాలిక లేదా తీవ్రమైన తలనొప్పి కూడా కనిపిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.కోలుకున్న కరోనా రోగులను అంచనా వేయడానికి భారత్ తన సొంత అధ్యయనంతో పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో మూడు, వివిధ రాష్ట్రాల్లోని ఆరు ఎయిమ్స్ సహా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని తొమ్మిది హాస్పిటల్స్ కోలుకున్న తర్వాత దీర్ఘకాలిక సమస్యలపై అధ్యయనం చేస్తున్నాయి.

Tags :
|

Advertisement