Advertisement

  • ఢిల్లీలో ప్రతి శీతాకాలానికి ముందు గాలి కాలుష్యం పెరగడానికి గల కారణం?

ఢిల్లీలో ప్రతి శీతాకాలానికి ముందు గాలి కాలుష్యం పెరగడానికి గల కారణం?

By: chandrasekar Mon, 19 Oct 2020 10:26 AM

ఢిల్లీలో ప్రతి శీతాకాలానికి ముందు గాలి కాలుష్యం పెరగడానికి గల కారణం?


ఢిల్లీలో ప్రతి శీతాకాలానికి ముందు గాలి కాలుష్యం పెరగడానికి గల కారణాన్ని గుర్తించారు. ఇందు కోసం తీసికోవలసిన జాగ్రత్తలు గురించి పర్యవేక్షిస్తున్నారు. దేశ రాజధానిలో మరోసారి కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రతి శీతాకాలానికి ముందు ఎదురయ్యే పరిస్థితే తలెత్తుతోంది. ప్రస్తుతం గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారిపోతోందని కేంద్రం హెచ్చరిస్తోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ ఇప్పుడు మరోసారి కాలుష్యకోరల్లో చిక్కుకుంటోంది. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్డౌన్ సమయంలో కాలుష్యం దాదాపు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితిని చూశాం. ఇప్పుడు తిరిగి కాలుష్యం యధాతధస్థితికి చేరుకుపోతోంది. మరీ ముఖ్యంగా గాలి నాణ్యత పడిపోతోందని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఇక్కడ వాస్తవానికి ఢిల్లీలో ప్రతి యేటా శీతాకాలం ప్రారంభం కంటే ముందు కాలుష్యం సమస్య తలెత్తుతుంటుంది. ప్రతియేటా ఈ సమయంలో ఢిల్లీ చుట్టుపక్కలున్న హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో రైతులు విపరీతంగా పంటవ్యర్ధాల్ని అంటే వరిపంట మిగులుని కాల్చేస్తుంటారు. సాధారణంగా ఓ పంట పూర్తయిన తరువాత మరో పంట వేయడానికి దక్షిణాది రైతులకు, ఉత్తరాది రైతులకు తేడా ఉంటుంది. కానీ దక్షిణాది రైతులు కూలీలతో పొలం దుక్కి దున్ని కొత్త పంట వేస్తుంటారు. కానీ ఉత్తరాది రైతులు మాత్రం ఖర్చులు మిగుల్చుకునే క్రమంలో పంటవ్యర్ధాల్ని కాల్చివేస్తుంటారు.

పంటవ్యర్ధాల్ని వేలాది ఎకరాల్లో ఇలా చేయడం వల్ల ఆ కాలుష్యమంతా పొరుగున ఉన్న ఢిల్లీ నగరంపై వచ్చి పడుతుంటుంది. ఈ కారణంగా పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గాలిలో నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో గాలిలో నాణ్యత తగ్గిపోతోందని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది. మరి కొన్నిరోజుల్లో ప్రారంభమయ్యే వరి వ్యర్ధాల దహనంతో కాలుష్యం మరింతగా పెరిగే అవకాశముందని తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆదివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు గాలిలో నాణ్యత 275 ఏక్యూఐగా నమోదైంది. 24 గంటల సగటు ఏక్యూఐ శనివారం 287గా ఉంది. శుక్రవారం 239 ఉండగా గురువారం 315 ఉంది. ఇక గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే శుద్ధమైందిగా, 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా ఉందని చెబుతారు. అదే 201-300 మధ్య ఉంటే పేలవంగా ఉందని..301-400 మధ్యన ఉంటే అతి పేలవమని అంటారు. 401-500 మద్య ఉంటే మాత్రం తీవ్రమైన కాలుష్యంగా పిలుస్తారు. ఢిల్లీలో పగటిపూట వాయువ్య దిశలో గాలులు వీస్తుండటం వల్ల చుట్టుపక్కల రాష్ట్రాల్లో కాల్చే పంట వ్యర్ధాల కాలుష్యం ఢిల్లీపై పడుతుంటుంది.

గాలి ద్వారా ఇక్కడ చేరుకున్న వ్యర్ధాలు అటు రాత్రి సమయంలో గాలులు, తక్కువ ఉష్ణోగ్రత కారణంగా వచ్చి చేరుతున్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ప్రస్తుతం పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ఏక్యూఐ 882గా ఉందని ఎర్త్ సైన్సెస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థ తెలిపింది. గాలిలోని నాణ్యతపై గడ్డి దహనం ప్రబావం గణనీయంగానే ఉందని ఈ సంస్థ వెల్లడించింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం గడ్డి దహనం తక్కువగానే ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. దీనికి కారణం ఈ యేడాది బాస్మతి యేతర వరి సాగు తక్కువగా ఉండటమే. నాన్ బాస్మతిలో సిలికా ఎక్కువగా ఉండటం వల్ల పశుగ్రాసంగా కూడా పనికి రాదు. దాంతో రైతులు కాల్చేస్తుంటారు. ఇక్కడ వరి గడ్డి దహనానికి తోడు ఢిల్లీలో వాహన, పరిశ్రమల కాలుష్యం కూడా మళ్లీ క్రమంగా పెరుగుతోంది. వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి సరి మరియు బేసి నెంబర్ ఫార్ములా ప్రవేశపెట్టినా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. అందుకే ఈసారి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రాంతాల్లో స్మాగ్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టవర్లు ఏ మేరకు ప్రభావం చూపుతాయో తెలియాల్సి వుంది. ఇందువల్ల చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదురుకొంటున్నారు.

Tags :

Advertisement