Advertisement

ఏలూరు నగర ప్రజల అస్వస్థతకు కారణం...

By: chandrasekar Sat, 19 Dec 2020 11:18 AM

ఏలూరు నగర ప్రజల అస్వస్థతకు కారణం...


కొన్ని రోజుల క్రితం ఏపీ లోని ఏలూరులో ప్రాణాలు తీవ్ర అస్వస్థతకు లోనైనా విషయం తెలిసిందే. ఇందుకు అసలు కారణాలు గుర్తించుటకు తీసికున్న చర్యల్లో పలు విషయాలు వెలువడ్డాయి. ఇక్కడ ఏర్పడ్డ అస్వస్థతకు వైరస్‌ మరియు బ్యాక్టీరియా కారణం కాదని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) ప్రభుత్వానికి అందించిన నివేదికలో తెలిపింది.

ఇందుకు అసలు కారణం నీటి కాలుష్యం అని అందువల్లే అస్వస్థతకు గురైనట్లు తమ నివేదికలో సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ఈ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా నీటిని కలుషితం కావడం వల్ల ప్రజలు అస్వస్థతతో అనారోగ్యం బారీన పడి ఉంటారని తెలిపారు. ఈనెల మొదటివారం చివరలో సేకరించిన నీటి నమూనాల్లో నీటి కలుషితం స్థాయి తగ్గినట్లు గుర్తించబడలేదని ఈయన తెలిపారు. కానీ ఐఐసీటీ ఇచ్చిన నివేదికలో అస్వస్థతకు నీరు కారణం కాదని కలెక్టర్‌ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ ప్రాంతంలో పెస్టిసైడ్స్ ఉన్నందువల్ల ఈ సంఘటన కు కారణమని ఎన్‌ఐఎన్ తెలిపింది.

Tags :

Advertisement