Advertisement

  • వారం రోజుల్లోనే బీజింగ్‌లో వైర‌స్ శ‌ర‌వేగంగా విస్తరణ

వారం రోజుల్లోనే బీజింగ్‌లో వైర‌స్ శ‌ర‌వేగంగా విస్తరణ

By: chandrasekar Sat, 20 June 2020 5:30 PM

వారం రోజుల్లోనే బీజింగ్‌లో వైర‌స్ శ‌ర‌వేగంగా విస్తరణ


చైనా రాజ‌ధాని బీజింగ్‌లో తాజాగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. జిన్‌ఫాది మార్కెట్‌లో కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో న‌గ‌రం అంతా అప్ర‌మ‌త్త‌మైంది. కానీ వారం రోజుల్లోనే బీజింగ్‌లో వైర‌స్ శ‌ర‌వేగంగా విస్త‌రించింది. వంద మందికిపైగా మృతిచెందారు.

ప్ర‌స్తుతానికి న‌గ‌ర జ‌నాభాకు అధికారులు న్యూక్లియ‌క్ యాసిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే తాజాగా అల‌జ‌డి సృష్టిస్తున్న ఆ వైర‌స్‌కు చెందిన జ‌న్యు డేటాను చైనా అధికారులు రిలీజ్ చేశారు. బీజింగ్‌లో ప్ర‌స్తుతం క‌నిపిస్తున్న వైర‌స్ జ‌న్యు క్ర‌మం యురోపియ‌న్ వైర‌స్ జ‌న్యుక్ర‌మంతో పోలిక‌లు ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

ప్ర‌పంచ దేశాల‌కు ఆ జ‌న్యువును తెలియ‌జేయాల‌న్న ఉద్దేశంతో బీజింగ్ వైర‌స్ జ‌న్యు క్ర‌మాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు అంద‌జేసిన‌ట్లు చైనా పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతానికి బీజింగ్‌లోని స్కూళ్లు, కాలేజీల‌ను బంద్ చేశారు. వుహాన్ నుంచి వైర‌స్ యూరోప్‌కు వెళ్లింద‌ని, ఆ త‌ర్వాత అది అక్క‌డ నుంచి బీజింగ్‌కు వ‌చ్చిన‌ట్లు హాంగ్‌కాంగ్ ప‌బ్లిక్ హెల్త్ వ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ బెన్ కౌలింగ్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ వైర‌స్సే ఇప్పుడు బీజింగ్‌ను వ‌ణికిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Tags :
|
|

Advertisement