Advertisement

హైదరాబాద్‌లో కురిసిన వర్షం ఆనందం లో ప్రజలు

By: chandrasekar Mon, 01 June 2020 11:47 AM

హైదరాబాద్‌లో కురిసిన వర్షం ఆనందం లో ప్రజలు


హైదరాబాద్‌లో నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ తీవ్ర ఎండ ఉంది. మధ్యాహ్నం నల్ల మేఘాలు కమ్ముకుని భారీగా వర్షాలు కురిసాయి. దాంతో ఎండ క్రమంగా కనుమరుగైంది. ఒంటిగంట సమయంలో పూర్తిగా ఎండ పోయింది. ఆ తర్వాత ఈదురు గాలి మొదలైంది. మధ్యాహ్నం నల్ల మేఘాలు కమ్ముకుని భారీగా వర్షాలు కురిసాయి.

మధ్య మధ్యలో ఉరుములు, మెరుపులతో చెవులు జిల్లు మనే సౌండ్లు. సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ అధికారులు చెప్పడంతో GHMC సిబ్బంది ముందుగానే అలర్ట్ అయ్యారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

గత వారం ఇలాగే హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. పెద్ద సంఖ్యలో చెట్లు, కరెంటు స్తంభాలూ కూలిపోవడంతో వాటిని తొలగించేందుకు GHMCకి రెండు రోజులు పట్టింది.


the rain,in hyderabad,is the joy,of the people,heavy ,హైదరాబాద్‌లో, కురిసిన, వర్షం, ఆనందం లో, ప్రజలు


ప్రస్తుతం సిటీలో చాలా చోట్ల కరెంటు లేదు. ఎప్పుడు ఏమవుతుందో, ఎంత భారీ వర్షం పడుతుందోనని సిటీ ప్రజలు ఆందోళనచెందుతున్నారు. ఓ అంచనా ప్రకారం హైదరాబాద్‌కి వచ్చినవి క్యుములోనింబస్ మేఘాలు. అవి చాలా వర్షం సాంధ్రత కలిగివుంటాయి.

అలాగే వాటి వల్ల ఉరుములు, మెరుపులు, పిడుగులు పడుతూ ఉంటాయి. అందువల్ల మామూలు మేఘాలతో కంటే ఈ మేఘాలతో ప్రమాదం ఎక్కువ. ఇవి ఒకేసారి ఎక్కువ వర్షం కురిపిస్తాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు కోరుతున్నారు.

Tags :

Advertisement