Advertisement

  • రూ.30 నుంచి 35 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోయిన రైల్వే శాఖ

రూ.30 నుంచి 35 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోయిన రైల్వే శాఖ

By: chandrasekar Thu, 30 July 2020 8:36 PM

రూ.30 నుంచి 35 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోయిన  రైల్వే శాఖ


భారతీయ రైల్వే ప్యాసింజర్స్‌ రైళ్ల నుంచి రూ.30 నుంచి 35 వేల కోట్ల ఆదాయాన్ని కరోనా సంక్షోభం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా కోల్పోవచ్చని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్యాసింజర్ల నుంచి కేవలం 10 నుంచి 15 శాతం ఆదాయాన్ని మాత్రమే రైల్వే పొందిందని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా రైలు ప్రయాణాలను రద్దు చేయడం వల్లే ఆదాయంపై గండి పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం రైల్వే 230 ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వినోద్ యాదవ్ మాట్లాడుతూ ‘‘మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందో అర్థం కావడం లేదు. 2020 సంవత్సరంలో సరుకు రవాణాను 50 శాతం పెంచాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేయబడతాయి" అని ఆయన అన్నారు.

ఇటీవల రైల్వే తన జనరల్ మేనేజర్లందరికీ 50 శాతం ఖాళీలను తగ్గించి, కొత్త పోస్టులను సృష్టించడం మానేయాలని కోరుతూ ఒక లేఖను విడుదల చేసింది. దీనిపై రైల్వే బోర్డు డైరెక్టర్ జనరల్ (హెచ్ఆర్) ఒక వివరణ ఇచ్చారు. రైల్వే ఉద్యోగులను తగ్గించడం లేదని స్పష్టం చేశారు. రైల్వేలో అనేక సాంకేతిక పరిణామాల వల్ల కొన్ని ఉద్యోగాల ప్రొఫైల్స్ మార్చవచ్చు. చాలా మంది ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలపై శిక్షణ ఇస్తామని, అయితే తొలగింపులు ఉండవని తెలిసింది.

Tags :
|

Advertisement