Advertisement

షిప్పింగ్ శాఖ పేరును మార్చనున్న ప్రధాని...

By: chandrasekar Mon, 09 Nov 2020 6:34 PM

షిప్పింగ్ శాఖ పేరును మార్చనున్న ప్రధాని...


షిప్పింగ్ శాఖ పేరును మార్చనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మంత్రిత్వశాఖ పేరును ‘మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్‌, షిప్పింగ్ అండ్ వాట‌ర్‌వేస్‌’గా మార్పు చేయనున్నట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌ లో భాగంగా దేశంలోని సముద్రతీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.

అయితే గుజరాత్‌ సూరత్‌లోని హజారియా - భావ్‌నగర్ ఘోఘా మధ్య రోపాక్స్‌ ఫెర్రీ (నౌక) సర్వీసును ఆదివారం నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దీని ద్వారా ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 370 కి.మీ దూరం 90 కిలోమీటర్లకు తగ్గనుంది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్‌ కార్యక్రమంలో భాగంగా షిప్పింగ్‌ శాఖ పేరును మార్చనున్నట్లు ప్రకటించారు. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర రవాణాను బలోపేతం చేయాలని ఆయన వివరించారు.

దేశంలో నోట్లు రద్దు చేసి నాలుగేళ్లు నిండిన సందర్బంగా.. ప్రధాని ట్విట్ చేశారు. దేశంలో నోట్ల రద్దు నల్లధనాన్ని తగ్గించేందుకు, పన్ను వ్యవహారాలను మెరుగుపర్చి.. పారదర్శకతను పెంపొందించేందుకు దోహద పడిందని తెలిపారు. ఈ సందర్భంగా జీడీపీ నిష్పత్తికి నోట్ల రద్దు ఎలా దోహదపడిందో తెలిపే గ్రాఫిక్‌ను ప్రధాని ట్విట్ చేశారు.

Tags :
|
|

Advertisement