Advertisement

70 శాతం వరకు తగ్గిన యాలకుల ధర...

By: chandrasekar Mon, 30 Nov 2020 11:27 PM

70 శాతం వరకు తగ్గిన యాలకుల ధర...


కరోనా వైరస్ ప్రభావం యాలకుల మార్కెట్‌పై ఇప్పుడు బాగా కనిపిస్తోంది. యాలకుల ధర భారీగా పడిపోయింది. ఏకంగా 70 శాతం మేర పతనమైంది. కరోనా వైరస్ తొలినాళ్లలో రికార్డ్ స్థాయికి చేరిన యాలకుల ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ సాధారణ స్థాయిలోనే ఉంది.

2020 జనవరిలో యాలకుల ధర రికార్డ్ స్థాయికి చేరిందని చెప్పవచ్చు. అప్పుడు కేజీ ఏలకుల ధర ఏకంగా రూ.7 వేలకి చేరింది. రేటు భారీగా పెరిగిపోవడంతో ఈ ప్రభావం ఎగుమతులపై కూడా పడింది. అదే సమయంలో వీటి వినియోగం కూడా దేశీయ మార్కెట్‌లో బాగా తగ్గిపోయింది.

దీంతో దేశీ మార్కెట్‌లో యాలకులు ధర తగ్గుతూ వచ్చింది. దీపావళి నాటి నుంచే ధరలో తగ్గుదల మొదలైంది. మార్కెట్‌లోకి కొత్త సరుకు రావడంతో ధరలు మరింత తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్‌లో యాలికల ధర కిలో రూ.2 వేల నుంచి మొదలవుతోంది.

అయితే కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రం రేటు ఎక్కువగానే ఉంది. యాలుకల ధర పెరిగిపోవడం సౌదీ అరేబియా కూడా వీటి కొనుగోలును తగ్గించేసింది. దీంతో ఎగుమతులపై ప్రభావం పడిందని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పుడు రేటు తగ్గడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుంది. అయితే కొనే వారికి మాత్రం ప్రయోజనం ఉంటుంది.

Tags :

Advertisement