Advertisement

టీడీపీ కార్యకర్తను బెదిరించిన పోలీసులు

By: chandrasekar Fri, 10 July 2020 10:54 AM

టీడీపీ కార్యకర్తను బెదిరించిన పోలీసులు


టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ కార్యకర్త అయిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి గురువారం ఫోన్‌ చేశారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టినందుకు నెల్లూరు జిల్లాకు చెందిన ఈయనకు పోలీసులు ఫోన్ చేసి బెదిరించారు.

ఈ క్రమంలో చంద్రబాబు శ్రీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. తాను ఏ తప్పు చెయ్యలేదని, పోలీసుల బెదిరింపులకు లొంగేది లేదని శ్రీకాంత్ రెడ్డి ఫోన్లో చంద్రబాబుకు సమాధానం చెప్పారు. చట్టప్రకారం వారు ఏ చర్యలు తీసుకున్నా సిద్ధమని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన శ్రీకాంత్ రెడ్డి ఆడియోతో అతనికి బెదిరింపులు ఎదురు కావడంతో, విషయం తెలుసుకున్న చంద్రబాబు ఫోన్ కాల్ చేశారు. ఫోన్ చేసి నేనున్నా అని ధైర్యం చెప్పారు. బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛని కాపాడుకోవాలని చంద్రబాబు శ్రీకాంత్ రెడ్డిని ప్రశంసించారు. పోలీసు వ్యవస్థ ప్రజల్ని రక్షించే విధంగా ఉండాలి కానీ, బెదిరింపులకు, రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను వాడుకోవడం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాసే అధికారం ఎవ్వరికి లేదని అన్నారు. ‘‘తప్పు చెయ్యని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలులో లేదు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీ నేతల అరెస్టుల విషయంలో ఇది స్పష్టంగా అర్థం అవుతుంది. ఒక కార్యకర్తగా మీరు పోలీసులకు అంబేడ్కర్ గారి రాజ్యాంగాన్ని గుర్తుచేశారు. మీరు చూపిన ధైర్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.’’ అని శ్రీకాంత్ రెడ్డితో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు.

Tags :

Advertisement