Advertisement

  • అమర్‌నాథ్ మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఈ ఏడాది పూర్తిగా రద్దు

అమర్‌నాథ్ మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఈ ఏడాది పూర్తిగా రద్దు

By: chandrasekar Wed, 22 July 2020 4:43 PM

అమర్‌నాథ్ మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఈ ఏడాది పూర్తిగా రద్దు


మంచు కొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఈ ఏడాది పూర్తిగా రద్దయింది. ఆ యాత్రపై తుది నిర్ణయం తీసుకునే అంశంపై శ్రీ అమర్‌నాథ్ ష్రైన్ బోర్డు (ఎస్‌ఏబీఎస్) మంగళవారం సమావేశమైంది.

కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యాత్ర నిర్వహించడం ఎంతమాత్రం సురక్షితం కాదని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మంచు లింగాన్ని దర్శించుకోవాలని ఎదురుచూసిన భక్తులకు నిరాశే మిగిలింది.

pilgrimage,amarnath mahasiva,completely,canceled,year ,అమర్‌నాథ్,  మహాశివుని , దర్శనానికి సాగే , యాత్ర ఈ ఏడాది,  పూర్తిగా రద్దు


ఏడాదిలో కేవలం 45 రోజుల పాటు మాత్రమే కనిపించే మంచు శివలింగ దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఈ మంచులింగం దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. చుట్టూ ఎత్తయిన కొండల మధ్య లోయల వెంట సాగే ప్రయాణం అత్యంత మనోహరంగా, ప్రమాధకరంగానూ కూడా ఉంటుంది.

పైకి వెళ్తున్న కొద్ది ఆక్సీజన్‌ అందనంత ప్రమాదకరమైన వాతావరణం ఉంటుంది. దీంతో పాటు మైనస్‌ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణస్థితిలో ప్రయాణం. వెంట్రుకవాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. దీంతో పాటు అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ యాత్రకు ఏటా చాలా మంది భక్తులు వెళ్తుంటారు.

Tags :

Advertisement