Advertisement

  • హైకోర్టులో వేసిన పిటిషన్ వెనుక్కు తీసుకున్నజగన్ ప్రభుత్వం

హైకోర్టులో వేసిన పిటిషన్ వెనుక్కు తీసుకున్నజగన్ ప్రభుత్వం

By: chandrasekar Wed, 03 June 2020 3:15 PM

హైకోర్టులో వేసిన పిటిషన్ వెనుక్కు తీసుకున్నజగన్ ప్రభుత్వం


ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్‌ఈసీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ కేసులో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. జస్టిస్ కనగరాజ్ తరఫున వేసిన స్టే పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకున్నారు.

నిమ్మగడ్డ తరపున దాఖలైన పిటిషనర్లకు ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించగా ఏమీ లేవనడంతో పిటిషన్ వెనక్కు తీసుకునేందుకు ఓకే చెప్పింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేయడంతో హైకోర్టు పిటిషన్‌ను వెనక్కు తీసుకుంది.

the petition,filed,the high court,withdrawn,jagan government ,హైకోర్టులో, వేసిన, పిటిషన్, వెనుక్కు, తీసుకున్నజగన్


ప్రభుత్వ పిటిషన్ సంగతి అలా ఉంటే సుప్రీంకోర్టులో మరో కేవియట్ పిటిషన్ దాఖలైంది. నిమ్మగడ్డ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కేవియట్ వేశారు. ఇప్పటికే ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి కూడా కేవియట్ దాఖలు చేశారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాల్సిందేనంటూ మే 29న హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుతం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Tags :
|

Advertisement