Advertisement

  • 2021 ప్రారంభానికి ముందే ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి

2021 ప్రారంభానికి ముందే ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి

By: chandrasekar Mon, 05 Oct 2020 09:43 AM

2021 ప్రారంభానికి ముందే ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి


ప్రపంచవ్యాప్తంగా అనేక ఔషధ కంపెనీలు కరోనా వాక్సిన్ కొరకు వివిధ దశల్లో పరీక్షలు కొనసాగిస్తున్న వేళ ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ 2021 ప్రారంభానికి ముందే తమ వాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. కొన్ని టీకాలు చివరిదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఈ తరుణంలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శుభవార్త అందించింది. మూడు నెలల్లోగా తమ వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. 2021 ప్రారంభానికి ముందే దీనిని ఆమోదిస్తున్నారని ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వాక్సిన్ కోసం చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే పిల్లలను మినహాయించి పెద్దలందరికీ రోగనిరోధకత కార్యక్రమం ఊహించినదానికంటే ముందే ప్రారంభం కానుంది. ఆరు నెలల్లోపు ప్రతి పెద్దవారికి వ్యాక్సిన్‌ డోస్‌ అందుతుందని ఆరోగ్య అధికారులు అంచనావేస్తున్నారు. కాగా, ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ తయారుచేసిన ఈ టీకాపై డేటా సమీక్షను యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ ప్రారంభించింది. ఈ ప్రాంతంలో వ్యాక్సిన్‌ను ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడమే దీని లక్ష్యమని ఏజెన్సీ ఇటీవల వెల్లడించింది. ఇందువల్ల ప్రజలకు వైరస్ వ్యాప్తి చెందకుండా చేయవచ్చు.

Tags :
|

Advertisement