Advertisement

మానవత్వం ఇంకా మిగిలి ఉందని నిరూపించిన నర్సు...

By: chandrasekar Tue, 10 Nov 2020 2:55 PM

మానవత్వం ఇంకా మిగిలి ఉందని నిరూపించిన నర్సు...


తిరువనంతపురం: కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. కరోనా వార్డులో కేరళ నర్సు స్టెఫీ సైమన్ ఒక వృద్ధుడికి తన చేతితో ఆహారం తినిపించిన సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు.

76 ఏళ్ల గోపి పిళ్ళై కరోనా సోకడంతో అలప్పుజ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని కరోనా వార్డులో చేరారు. అతనికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో గోపి పిళ్ళై భోజనం చేయడానికి నిరాకరించారు.

ఆ సమయంలో నర్సు స్టెఫీ సైమన్ తన చేతితో పిళ్ళైకి ముద్దలు తినిపించి మరీ అతని ఆకలితీర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. అదే వార్డులో ఉన్న సుహైల్‌ సానీ ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తనను చాలా మంది అభినందిస్తున్నారని స్టెఫీ చెప్పారు.

Tags :

Advertisement