Advertisement

  • వైరస్ లక్షణాలు బయటకు కనిపించని రోగుల్లోనూ వైరస్ సంఖ్య అధికం

వైరస్ లక్షణాలు బయటకు కనిపించని రోగుల్లోనూ వైరస్ సంఖ్య అధికం

By: chandrasekar Wed, 02 Sept 2020 4:01 PM

వైరస్ లక్షణాలు బయటకు కనిపించని రోగుల్లోనూ వైరస్ సంఖ్య అధికం


హైదరాబాద్‌ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిన విషయమేమిటంటే వైరస్‌ లక్షణాలు బయటకు కనిపించని రోగుల్లోనూ వైరస్‌ సంఖ్య అధికంగా ఉంటోంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని 210 మంది రోగులపై హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ) శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు.

నమూనాలు సేకరించిన రోగుల్లో ఎక్కువగా 20బీ స్ట్రెయిన్‌ వైరస్‌ ఉన్నట్టు నిర్ధారించారు. హైదరాబాద్‌ పరిసరాల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగడానికి అతి ఎక్కువ తీవ్రత కలిగిన ‘డీ614జీ’ రకం వైరస్‌ ఉత్పరివర్తనమే కారణమని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

లక్షణాలు లేని వారిలో వైరల్‌ సంఖ్య‌ ఎక్కువగా ఉన్నట్టు తమ పరిశోధనల్లో తేలిందని సీడీఎఫ్‌డీ పరిశోధకుడు భాష్యం మురళీధరన్‌ తెలిపారు. దీంతో లక్షణాలు లేని రోగుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించడంతోపాటు వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Tags :
|

Advertisement